‘పెద్దగట్టు’ హుండీ ఆదాయం లెక్కింపు
చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి(పెద్దగట్టు) ఆలయ హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లెక్కించారు. పెద్దగట్టు జాతర ఫిభ్రవరి 20వ తేదీన ముగియగా.. ఫిభ్రవరి 21 నుంచి మార్చి 5 వరకు వచ్చిన హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. 13 రోజులకు గాను రూ.5.24 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె. భాస్కర్, ఇన్‌స్పెక్టర్ బి. సుమతి, ఆలయ కమిటీ చైర్మన్ పోలేబోయిన నర్సయ్యయాదవ్, ఈఓ కుశలయ్య, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌లో వింత జంతువు ప్రత్యక్షం
హుజూర్‌నగర్: హుజూర్‌నగర్‌లో బుధవారం వింత జంతువు ప్రత్యక్షమైంది. పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో నివాసముంటున్న రఫీ ఇంట్లో మామిడి చెట్టుపై నల్లని వింత జంతువు కనిపించడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నరసింహారావు వచ్చి ఆ జంతువును పరిశీలించి దానిని సీవీఎట్ క్యాట్‌గా పిలుస్తారని చెప్పారు. ఇది మనుషులకు హాని చేయదని, అడవుల్లోనే రాత్రివేళ ఎక్కువగా సంచరిస్తుందని పేర్కొన్నారు.
200 టేకు చెట్లు దగ్ధం
ఆత్మకూరు(ఎం): గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో టేకు చెట్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండలం రాయిపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. రాయిపల్లి గ్రామానికి చెందిన జెట్ట శ్రీనివాస్ వ్యవసాయ భూమిలో సుమారు 350 టేకు చెట్ల ఉన్నాయి. ఈ టేకు చెట్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 200 చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మోత్కూరు నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. సుమారు రూ.2.50లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు పేర్కొన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
‘పెద్దగట్టు’ హుండీ ఆదాయం లెక్కింపు
Comments
Please login to add a commentAdd a comment