గ్లాకోమా పరీక్ష చేయించుకోండి
కనగల్: కంటి వ్యాధుల నిర్ధారణకే కనగల్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో గ్లాకోమా(కంట్లో నీటి కాసులు) సెంటర్ ఏర్పాటు చేయించానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం కనగల్‌లోని పీహెచ్‌సీ నూతన భవనంతోపాటు గ్లాకోమా సెంటర్ మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహీంద్రా యూనివర్శిటీలోని సెంటర్ ఫర్ లైఫ్ సైన్స్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అధ్యయనం చేస్తున్న డాక్టర్ బిపిన్ తనను కలిసి వివరించి ఇక్కడ గ్లాకోమా సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కంటి పరీక్షలకు కావాల్సిన అన్ని పరికరాలను ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందించామని, ఇంకేమైనా కావాల్సి ఉంటే అందిస్తామన్నారు. కంటి వ్యాధుల నిర్ధారణకు సంబంధించి జిల్లాలోనే మొదటిసారిగా కనగల్ పీహెచ్‌సీలో గ్లాకోమా సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 40 ఏళ్లు నిండిన మహిళల్లో కంటిచూపును ప్రభావితం చేసే గ్లాకోమా సమస్య తీవ్రంగా ఉంటుందని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. మరో 30 రోజుల పాటు మండలంలో కంటి పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత జిల్లా మొత్తం చేయాలన్నారు. అవసరమైన వారందరికీ కంటి అద్దాలు కూడా అందిస్తామని తెలిపారు.
రోడ్ల అభివృద్ధికి నిధులు
కనగల్ నుంచి నాగార్జునసాగర్ హైవే కలిపే విధంగా రూ.15 కోట్లతో రోడ్డుకు టెండర్లు పిలిచామన్నారు. కనగల్ మండలంలోని రోడ్ల అభివృద్ధికి రూ.60 కోట్లు మంజూరు చేశామన్నారు. కనగల్, తిప్పర్తి మండలాలకు జూనియర్ కళాశాలలు మంజూరయ్యాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డాక్టర్ సుపర్ణ, మహేంద్ర, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, టీజీ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జైపాల్‌రెడ్డి, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివశంకర్‌రెడ్డి, కనగల్ పీహెచ్‌సీ వైద్యాధికారి రామకృష్ణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మందడి రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింగ్ సునీత కృష్ణయ్యగౌడ్ పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఫ కనగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గ్లాకోమా సెంటర్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment