10 నుంచి ‘పోరుబాట’ | - | Sakshi
Sakshi News home page

10 నుంచి ‘పోరుబాట’

Published Thu, Mar 6 2025 2:03 AM | Last Updated on Thu, Mar 6 2025 1:59 AM

10 ను

10 నుంచి ‘పోరుబాట’

మిర్యాలగూడ అర్బన్‌: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 10వ తేదీ నుంచి పోరుబాట కార్యక్రమం నిర్వహించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. మిర్యాలగూడలోని సీపీఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 10 తేదీన అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలను తెలుసుకోవాలన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా సంతకాల సేకరణ చేపట్టాలన్నారు. 15వ తేదీ వరకు అన్ని గ్రామాలు, పట్టణాలలో దోళనలు చేపట్టాలన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో 24, 25, 26 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని కోరారు. 27న జిల్లా కేంద్రంలో మహాధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, మల్లు గౌతంరెడ్డి, భావండ్ల పాండు, అరుణ, కోడిరెక్క మల్లయ్య, పల్లా భిక్షం, కరిమున్నీషాబేగం, శ్రీను, వెంకన్న, రామారావు తదితరులు పాల్గొన్నారు.

హెచ్‌ఐవీపై అవగాహన సదస్సు

రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో బుధవారం ఎంజీ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ సహకారంతో హెచ్‌ఐవీపై రెడ్‌రిబ్బన్‌ క్లబ్‌ పీర్‌ లీడర్స్‌ అవగాహన సదస్సు నిర్వహించారు. లీడర్స్‌కు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ మద్దిలేటి, ప్రిన్సిపాల్‌ ఎస్‌.ఉపేందర్‌, రిసోర్స్‌పర్సన్‌ నరసింహారావు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రొగ్రాం ఆఫీసర్స్‌ మల్లేశం, సావిత్రి, శివరాణి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి కృషి

నల్లగొండ టౌన్‌: అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషిచేస్తానని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కేవీ.కృష్ణవేణి అన్నారు. బుధవారం నల్లగొండలోని టీఎన్జీఓ కార్యాలయంలో జిల్లా అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ క్యాలెండర్‌ను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, అసోసియేషన్‌ రాష్ట్ర కన్వీనర్‌ నామిరెడ్డి నిర్మల, జిల్లా అధ్యక్షురాలు జొన్నలగడ్డ వెంకటరమణ, కార్యదర్శి మజ్జిగపు సునీత, కోశాధికారి పుట్ట సునీత, సీడీపీఓ మమత, అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ శశికళ, కుర్షితా బేగం తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
10 నుంచి ‘పోరుబాట’1
1/1

10 నుంచి ‘పోరుబాట’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement