రంజాన్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలి
నల్లగొండ: రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన శ్రీశాంతి కమిట్ఙీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రంజాన్ సందర్భంగా బసీదుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. విలీన గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాలని సూచించారు. రంజాన్ రోజు పాలు ఎక్కువగా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు కోరగా, డెయిరీ డెవలప్‌మెంట్‌కు లేఖ రాస్తామని కలెక్టర్ తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన టోల్ ప్రీ 18004251442 నంబర్‌కు పోన్ చేయాలనిసూచించారు. ఎస్పీ శరత్ చంద్రపవర్ మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకొని అంతటా పోలీస్ పెట్రోలింగ్ పెంచుతామన్నారు. పూర్తి బందోబస్తు కల్పిస్తామన్నారు.
ప్రభుత్వ సంస్థల్లోనే నీట్ కేంద్రాల
ఏర్పాటు చేయాలి
మే 4న నిర్వహించనున్న నీట్ పరీక్షకు ప్రభుత్వ సంస్థల్లోనే సెంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాల ఏర్పాటు విషయమై బుధవారం ఆమె కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పట్టణంలో ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలను పరిశీలించాలన్నారు. జిల్లా నుంచి సుమారు 2,800 వరకు అభ్యర్థులు నీట్ పరీక్షలు రాసే అవకాశం ఉందన్నారు. వేర్వేరుగా జరిగిన ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇన్‌చార్జి డీఆర్‌ఓ అశోక్ రెడ్డి, శాంతి కమిటీ సభ్యులు గోలి మదుసూధన్‌రెడ్డి, ఖాజాగౌస్ మొహిద్దీన్, సలీం, రఫీక్, శౌరయ్య, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు, శాంతి కమిటీ సభ్యులు, నీట్ ప్రవేశ పరీక్ష నోడల్ అధికారి, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, జిల్లా డీఐఈఓ దస్రునాయక్, డీఈఓ భిక్షపతి, డీఎస్పీ రమేష్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment