కేతేపల్లి: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక్ దృష్టి పెట్టిందని జిల్లా రోడ్డు సేఫ్టీ ప్రత్యేకాధికారి పొలిశెట్టి అంజయ్య అన్నారు. కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామంలో జాతీయ రహదారి వెంట నూతనంగా నిర్మిస్తున్న సర్వీస్ రోడ్డు పనులను గురువారం సాయంత్రం ఆయన చౌదరి సంస్థ, కొర్లపహాడ్ టోల్‌ప్లాజా అధికారులతో కలిసి పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మిషన్ ఆర్‌ఆర్‌ఆర్ (రోడ్డు సేఫ్టీ, రూల్స్, రెస్పాన్స్‌బులిటీ) కార్యక్రమం పేరుతో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా జిల్లావ్యాప్తంగా ప్రమాదాలు జరుగుతున్న 109 గ్రామాలను గుర్తించామన్నారు. ప్రత్యేకించి ఇనుపాములలో సర్వీస్ రోడ్డు లేక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, నేడు సర్వీస్ నిర్మాణంతో ఇక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎస్పీ అమలు చేస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆయన వెంట చౌదరి సంస్థ, కొర్లపహాడ్ టోల్‌ప్లాజా అధికారులు నాగకృష్ణ, వరుణ్‌చౌదరి ఉన్నారు.
ఫ జిల్లా రోడ్డు సేఫ్టీ ప్రత్యేకాధికారి అంజయ్య
Comments
Please login to add a commentAdd a comment