ఇంటర్‌ పరీక్షలకు 12,963 మంది హాజరు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలకు 12,963 మంది హాజరు

Published Fri, Mar 7 2025 9:33 AM | Last Updated on Fri, Mar 7 2025 9:28 AM

ఇంటర్‌ పరీక్షలకు 12,963 మంది హాజరు

ఇంటర్‌ పరీక్షలకు 12,963 మంది హాజరు

నల్లగొండ: ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉద యం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన తెలుగు, హిందీ, అరబిక్‌, సంస్కృతం పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 13,295 మంది విద్యార్థులు హాజ రు కావల్సి ఉండగా 12,963 మంది హాజరయ్యారు. 332 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కేంద్రాలను డీఐఈఓ దస్రునాయక్‌ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. కాగా బుధవారం ఫస్టియర్‌ విద్యార్థులకు తెలుగు, హిందీ, అరబిక్‌, సంస్కృతం సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు జరిగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement