అతివ.. అలుపెరుగక
నేటి సమాజంలోని మహిళలు అన్నిరంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. కుటుంబాల పోషణకు వివిధ
వృత్తుల్లో కొందరు, వ్యాపార రంగంలో మరికొందరు దూసుకెళ్తున్నారు. ఇంకొందరు తమ గ్రామాల అభివృద్ధికి పాటుపడుతుండగా చాలా మంది మహిళలు సామాజిక అంశాలపై
అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు
మహిళలపై
ప్రత్యేక కథనాలు.
పురుషులతో సమానంగా కష్టపడుతున్న మహిళలు
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
హుజూర్‌నగర్: పురుషులకు దీటుగా ఆటో నడపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ శభాష్ అనిపించుకుంటోంది యడ్ల శ్రీదేవి. హుజూర్‌నగర్ పరిధిలోని గోవిందాపురం గ్రామానికి చెందిన బొల్లెద్దు రాణిమ్మ–సాయిలుది సాధారణ కుటుంబం. సాయిలు ఆటో నడుపుతూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. అతని పెద్ద కూతురు శ్రీదేవికి ఖమ్మంకు చెందిన యడ్ల వీరభద్రంతో పాతికేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కూతురు, కొడుకు ఉండగా కూతురు వివాహం చేసి అత్తవారింటికి పంపారు. ఆ తర్వాత భార్యభర్తలు విడిపోవడంతో శ్రీదేవి తన తల్లిగారి ఊరైన గోవిందాపురం వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. చిన్నతనంలో తన తండ్రి వద్ద ఆటో తోలడం నేర్చుకున్న శ్రీదేవి కుటుంబ పోషణ కోసం తాను కూడా ఆటో నడపాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా ఒక ఆటో కొనుక్కుని ఆటో డ్రైవర్‌గా మారింది. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు హుజూర్‌నగర్ లోకల్‌లో ఆటో నడుపుతుంది. చుట్టుపక్కల గ్రామాలకు, పట్టణాలకు కిరాయిలకు కూడా వెళుతోంది. ఆటో డ్రైవర్‌గా రోజుకు సుమారు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదిస్తోంది. వచ్చిన కిరాయి డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకుంటూనే తన తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటోంది. తన ఒక్కగానొక్క కొడుకు వేణగోపాల్‌ను ఖమ్మంలో డిగ్రీ చదివిస్తోంది. మహిళలు చిత్తశుద్ధితితో ఏ పని చేసినా విజయం సాధించవచ్చని శ్రీదేవి అంటోంది.
అతివ.. అలుపెరుగక
అతివ.. అలుపెరుగక
Comments
Please login to add a commentAdd a comment