చేనేతలో ‘ఆమె’ ఘనత
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన చేనేత కళాకారిణి ఎన్నం మాధవి చేనేత రంగంలో అనేక ప్రయోగాలు చేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. ఇంటర్ వరకు చదువుకున్న ఆమె తన భర్త ఎన్నం శివకుమార్ సహకారంతో కొర(లైట్ గోధుమరంగు), లైట్ పింక్, టర్కిష్ బ్లూ, గ్రే, లైట్ బ్రౌన్ రంగులతో మర్తాస్ ఫుల్ డిజైన్‌తో కూడిన వస్త్రాన్ని ఆవిష్కరించింది. దీంతో గతేడాది జాతీయ చేనేత దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ అవార్డుతో సత్కరించింది. ఇటీవల ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో ఆమె తెలంగాణ నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. గత నెల ఢిల్లీలోని సూరజ్‌కుండ్ మేళాలో ఆమె పాల్గొని పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల ఎగ్జిబిషన్, అదేవిధంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరుగుతున్న అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొని చేనేత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. పోచంపల్లి పట్టణ కేంద్రంలో శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీ యూనిట్‌ను స్థాపించి సిల్క్ దారం నుంచి వస్త్రం తయారీ వరకు అన్నీ ఒకే దగ్గర తయారు చేయిస్తోంది. ఈ పరిశ్రమ ద్వారా 50 మందికి ఉపాధి కల్పిస్తోంది. అంతేకాక శ్రీరంజ్ వీవ్స్ పేరిట షాపు నిర్వహిస్తూ చేనేత వస్త్రాలను మార్కెటింగ్ కూడా చేస్తోంది. 2023 డిసెంబర్ 20న పోచంపల్లికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీరంజన్ సిల్క్ యూనిట్‌ను సందర్శించారు. అక్కడ తయారైన చేనేత వస్త్రాలను చూసి మాధవిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాధవిని ప్రత్యేకంగా అభినందించారు.
ఫ సిల్క్ ఇండసీ్ట్ర యూనిట్ స్థాపించి 50 మందికి ఉపాధి
కల్పిస్తున్న పోచంపల్లి వాసి ఎన్నం మాధవి
చేనేతలో ‘ఆమె’ ఘనత
Comments
Please login to add a commentAdd a comment