వేలంపాటను అడ్డుకుని..
రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామంలో మూకుమ్మడిగా మద్యపాన నిషేధం పాటిస్తున్నారు. గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా బెల్టుషాపులు నడుస్తుండటంతో వృద్ధులు, యువకులు, పేదలు మద్యానికి బానిసై.. సంపాదించిందల్లా మద్యానికి ఖర్చు చేస్తునారు. అంతే కాకుండా గ్రామంలో బెల్టుషాపుల నిర్వహణ కోసం ఇటీవల వేలం పాట నిర్వహించారు. వేలంపాట వద్దని.. గ్రామంలోని కొంతమంది మహిళలు గ్రామస్తులతో కలిసి గ్రామంలో ఎలాంటి బెల్టుషాపులు నిర్వహించొద్దని, మద్యం విక్రయించొద్దని మూకుమ్మడిగా నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు.
అప్పట్లో సారాపై పోరాటం
పాముకుంట గ్రామంలో 2010–11 సమయంలో సారా ఏరులైపారేది. కూలినాలి చేసి వచ్చిన డబ్బంతా తాగుడుకే పోయేది. ఆ సమయంలో కుటుంబ పెద్దలను కోల్పోయి చాలా కుటుంబాలు వీధిన పడ్డాయి. దీంతో గ్రామానికి చెందిన మహిళలు ఏకమై సారా విక్రయ కేంద్రాలపై దాడిచేసి సామగ్రిని గ్రామం నడిబొడ్డున దహనం చేశారు. నా తర్వాత ప్రభుత్వం సారా విక్రయాన్ని నియంత్రించడంతో ఏడాదిపాటు గ్రామంలో సారా, మధ్యం విక్రయాలు జరగలేదు.
Comments
Please login to add a commentAdd a comment