ముగిసిన ఆపదమిత్ర వలంటీర్ల శిక్షణ
నల్లగొండ : జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం ఆధ్వర్యంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆపదమిత్ర వలంటీర్లకు నిర్వహిస్తున్న రెండో విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. 12 రోజులపాటు నిర్వహించిన శిక్షణలో ఎన్డీఆర్‌ఎఫ్ అధికారులు, జిల్లా ఫైర్, అటవీ, వైద్య, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, మత్స్య శాఖ, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులు వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ వై.శేఖర్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు, వరదలు, భూకంపాలు విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రాణాపాయస్థితిలో ఉన్నవారిని రక్షించడం, ప్రధమ చికిత్స, వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవడం వంటి అంశాలపై ఆపదమిత్ర వలంటీర్లకు అవగాహన కల్పించామని తెలిపారు. శిక్షణలో భాగంగా వలంటీర్లను రెండు గ్రూపులుగా విభజించి నాలుగు గ్రామాల్లో క్షేత్రస్థాయి సందర్శన చేయించామన్నారు. చెరువుల్లో చిక్కుకున్న వారిని రక్షించడంపై పానగల్ ఉదయ సముద్రంలో ఫైర్, మత్స్య శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. అనంతరం వలంటీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంసీఆర్ హెచ్‌ఐర్డీ ఐటీ ప్రాంతీయ శిక్షణ మేనేజర్ పి.వెంకటేశ్వర్లు, డీపీఎం మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment