ముగ్గురు మనోళ్లే..!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో ఉమ్మడి జిల్లాకు అగ్రస్థానం
కాంగ్రెస్ నుంచి ఇద్దరు.. సీపీఐ నుంచి ఒక్కరు ఖరారు
విద్యార్థి దశ నుంచే పోరుబాట
సీసీఐ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికై న నెల్లకంటి సత్యం చిన్ననాటి నుంచి వామపక్ష భావజాలానికి ఆకర్షితుడై విద్యార్థి దశ నుంచే పోరాట బాట పట్టారు. ఆనాటి భూస్వామ్య, పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. 1985 నుంచి 2000 వరకు ఏఐవైఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా.. జిల్లా కార్యదర్శిగా పని చేశారు. 2010 నుంచి 2016 వరకు సీపీఐ మునుగోడు మండల కార్యదర్శిగా ఉన్నారు. 2016 నుంచి సీపీఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి, 2020 నుంచి సీపీఐ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. బొమ్మగాని ధర్మభిక్షం అడుగు జాడల్లో పని చేస్తూ సీపీఐ బలోపేతానికి కృషి చేస్తూనే పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అగ్రస్థానం దక్కింది. రాష్ట్రంలో మొత్తం ఐదు స్థానాల ఖాళీ అవుతుండగా.. అందులో మూడు స్థానాలకు నల్లగొండ జిల్లా నుంచే అభ్యర్థులు ఖరారయ్యారు. వీటిలో కాంగ్రెస్‌పార్టీ ఇద్దరికి, సీపీఐ ఒక్కరికి అవకాశం కల్పించింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ పేర్లను అధిష్టానం ప్రకటించింది. ఇక.. పొత్తులో భాగంగా సీపీఐకి ఒక్క సీటు కేటాయించగా.. ఆ పార్టీ తమ అభ్యర్థిగా నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పేరును ఖరారు చేసింది. దీంతో ఎమ్మెల్సీ స్థానాల్లో జిల్లాకు పెద్దపీట వేసినట్లయ్యింది. వీరంతా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉండటంతో వీరి గెలుపు లాంఛనమే కానుంది. ఆయా పార్టీలకు విధేయులుగా.. పార్టీ కోసం కష్టపడ్డ సామాన్యులకే అవకాశం దక్కిందని ఆయా పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఉద్యమ నేత దయాకర్
తుంగతుర్తి నియోజక వర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. దయాకర్.. జాతీయ మాలమహానాడు వ్యవస్థాపకుడు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో (టీజేఏసీ) అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దయాకర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అనుచరుడిగా ఉంటూనే, కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా పనిచేశారు. ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో దయాకర్.. రేవంత్‌రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఆయన వెంటే ఉన్నారు. పార్టీ కోసమే పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. అయితే ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు కొందరు దయాకర్‌కు టికెట్ విషయంలో సానుకూలత వ్యక్తం చేయకపోవడంతో ఆయనకు టికెట్ దక్కలేదు. చివరకు మందుల సామెల్‌కు టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని చెప్పడంతో దయాకర్ మిన్నకుండిపోయారు. ఆ తరువాత గతేడాది జనవరిలోనూ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని దయాకర్ కోరారు. అధిష్టానం కూడా బల్మూరి వెంకట్‌తోపాటు ఆయన పేరును ఖరారు చేసింది. నామినేషన్ కోసం పత్రాలు సిద్ధం చేసుకోమని చెప్పి, ఆ తర్వాత మళ్లీ వద్దంటూ ఫోన్ చేసి షాకిచ్చింది. దయాకర్ స్థానంలో మహేష్‌కుమార్‌గౌడ్ పేరును ప్రకటించింది. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం అప్పుడు తప్పిపోయినా.. ఇప్పుడు అవకాశం లభించింది. ఇటీవల ఆయన మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని వారు కూడా లేఖలు ఇచ్చారు.
ఫ అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్‌నాయక్ పేర్లను
ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం
ఫ సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం
ఫ గతంలో మిస్ అయినా.. ఎట్టకేలకు పదవి దక్కించుకున్న అద్దంకి
ఫ పార్టీనే నమ్ముకున్న శంకర్‌నాయక్‌ను వరించిన ఎమ్మెల్సీ
ఫ విధేయుడినే ఎంపిక చేసిన
కమ్యూనిస్టు పార్టీ
ఫ సామాన్యులకే దక్కిన అవకాశం
ముగ్గురు మనోళ్లే..!
ముగ్గురు మనోళ్లే..!
Comments
Please login to add a commentAdd a comment