ఇచ్చిన హామీలు అమలు చేయాలి
భానుపురి (సూర్యాపేట): కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కోఆర్డినేటర్ అనంతుల మధు డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పలువరు తెలంగాణ ఉద్యమకారులు స్థానిక పోస్టాఫీస్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పోస్ట్ కార్డ్‌లు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ గౌరవం, స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం ఉద్యమించిన తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం 250గజాల ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన కోరారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ ఉద్యమ నాయకులు గట్ల రామశంకర్, బాషిపంగు సునీల్, పడిదల ప్రసాద్, పంతం యాకయ్య, మామిడిశెట్టి అంజయ్య, ధరవాత్ నాగేశ్వరావు, బారి ఖాన్, నారబోయిన్ కిరణ్, కొలికపంగు వాసు, పోరీళ్ల విప్లవ్‌కుమార్, ఓ బాబా, దుబ్బ రమేష్, బొడ్డు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment