హైవేపై మూడు కార్లు ఢీ
చిట్యాల: మండలంలోని పెద్దకాపర్తి గ్రామ పరిధిలో హైవేపై ఆదివారం వరుసగా వెళ్తున్న మూడు కార్లు అకస్మాత్తుగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వాహనాలు వెళ్తుండగా.. పెద్దకాపర్తి గ్రామ శివారులోని కోళ్ల ఫారాల వద్దకు రాగానే ముందు వెళ్తున్న ఓ వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో ఆ వెనకే ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఆ కార్లలో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒక మహిళ కాలు విరగగా, మరొకరి తలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment