వింత ఆలోచనలు
వికసించని మనసుల్లో..
టీనేజ్ బాలికలే ఎక్కువ..
సామాజిక మాధ్యమాల్లో అపరిచితులతో పరిచయాలు పెంచుకుంటున్న వారిలో ఎక్కువ మంది టీనేజ్ బాలికలు, మైనార్టీ తీరనివారే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తుందని పలువురు విద్యవేత్తలు అంటున్నారు. ఫేక్ ఐడీలతో మార్ఫింగ్ ఫొటోలతో కొంతమంది టీనేజ్ బాలికలతో పరిచయాలు పెంచుకొని మాయమాటలతో వారిని మోసం చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. మునగాల బాలికలను మోసం చేసిన వ్యక్తి 40 సంవత్సరాలకు పైబడి వయస్సున్నప్పటికి ఫ్రొఫైల్‌లో 20 సంవత్సరాల ఫొటో పెట్టి బాలికలను మోసం చేశాడు.
కోదాడ: తెలిసీతెలియని వయస్సులో సామాజిక మాధ్యమాల మోజులో పడి యువత పక్కదారి పడుతోంది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో ఏర్పడుతున్న పరిచయాలు కొద్దిరోజుల్లోనే ప్రేమలు, పెళ్లిళ్లకు దారితీస్తుండగా, మరికొన్ని చోట్ల బాలికలు మోసపోతున్నారు. ముక్కుమొహం తెలియని వ్యక్తులతో ఏర్పడిన వారం పది రోజుల పరిచయాలతోనే కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి వందల కిలోమీటర్లు వెళ్తున్నారు.
ఇష్టానికి వదిలేస్తున్నారా...
ఇంట్లో పిల్లలు సెల్‌ఫోన్ వాడుతున్నారని తెలిసినా తల్లితండ్రులు పట్టించుకోకుండా వారి ఇష్టానికి వదిలేస్తుండడంతో అపరిచితులతో పరిచయాలు పెంచుకుంటున్నారని పలువురు అంటున్నారు. సామాజిక మాధ్యమాలలో పిల్లలు ఏమి చేస్తున్నారో తల్లిదండ్రులు నిత్యం గమనించాలని నిపుణులు అంటున్నారు. అన్ని విషయాలను పిల్లల ఇష్టానికి వదిలేస్తుండడంతో పాటు ఎదుటి వ్యక్తి చెప్పే మాయమాటలకు టీనేజ్ పిల్లలు వెంటనే ఆకర్షితులై మోసపోతున్నారని పేర్కొంటున్నారు. కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలు సామాజిక మాద్యమాల్లో పెంచుకుంటున్న పరిచయాలు ఎలాంటివి..? వారు ఎవరితో మాట్లాడుతున్నారు..? ఎవరితో చాటింగ్ చేస్తున్నారో కనీసం గమనించడం లేదని, టీనేజ్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యమే అనర్ధాలకు దారి తీస్తోందని నిపుణులు చెబుతున్నారు.
సామాజిక మాధ్యమాల మోజులో పక్కదారి పడుతున్న టీనేజర్లు
చిన్న పరిచయాలతో
అతి కొద్దిరోజుల్లోనే ప్రేమకు
దారితీస్తున్న వైనం
ముక్కుమొహం తెలియని
వ్యక్తులతో ఇళ్లు వదిలి
వెళ్తున్న అమ్మాయిలు
తల్లిదండ్రులు నిత్యం
గమనించాలంటున్న పోలీసులు
తల్లిదండ్రులు బాధ్యత మరవొద్దు
సామాజిక మాధ్యమాలకు పిల్లలను దూరంగా ఉంచేలా తల్లిదండ్రులు చూడాలి. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు ఏం చేస్తున్నారో, ఎవ్వరితో పరిచయాలు పెంచుకుంటున్నారో నిత్యం గమనించాలి. దారి తప్పుతున్నారని గమనిస్తే తగిన విధంగా కౌన్సిలింగ్ ఇప్పించాలి. సామాజిక మాధ్యమాలతో వచ్చే మంచి చెడులను వారికి వివరించాలి. ప్రతి రోజు పిల్లలకు కొంత సమయం కేటాయించి వారితో మాట్లాడాలి.
– మామిళ్ల శ్రీధర్‌రెడ్డి, కోదాడ డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment