తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్‌వి జోకర్ చేష్టలు
మోత్కూరు: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ జోకర్ చేష్టలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. ఆదివారం మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలోని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు బిక్కేరుకు వస్తుండగా ఎమ్మెల్యే సామేల్ పూజలు చేసి తానే తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో మూసీ, బిక్కేరుల నుంచి దోసెడు ఇసుక తియ్యనివ్వనని హామీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచాక.. నేడు వంగమర్తి నుండి వందలాది లారీల్లో ఇసుక తరలింపు జరుగుతున్నా ఎమ్మెల్యే స్పందించడం లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో మంజూరు చేయించిన మున్సిపల్ పక్కా భవనం నిర్మాణాన్ని పూర్తి చేయించే శక్తి సామేల్‌కు లేదన్నారు. కేసీఆర్ కల్పించిన రిజర్వేషన్ల వల్లనే ప్రస్తుత వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నూనెముంతల విమలవెంకటేశ్వర్లు చైర్మన్ అయ్యారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డిలను ఎమ్మెల్యే సామేల్ తిడితే సహించేది లేదని హెచ్చరించారు. సింగిల్‌విండో చైర్మన్‌గా తాను, తన కుమారుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేసి, నేటికీ ఆ అవినీతి ఏంటో ఎమ్మెల్యే సామేల్ నిరూపించలేకపోయారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అబద్దాలు చెబుతూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో మోత్కూరు, అడ్డగూడూరు మండలాల అధ్యక్షులు పొన్నబోయిన రమేష్, కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు జంగ శ్రీను, ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేషం, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కొణతం యాకూబ్‌రెడ్డి, చిప్పలపల్లి మహేంద్రనాథ్, నాయకులు దాసరి తిరుమలేష్, రాంపాక నాగయ్య, సామ పద్మారెడ్డి, కొండా సోంమల్లు, కోక భిక్షం, అన్నందాసు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
కంచర్ల రామకృష్ణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment