పోలీసులు క్రీడాస్ఫూర్తిని చాటాలి
నల్లగొండ: పోలీసులు క్రీడా స్ఫూర్తిని చాటాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2025 కార్యక్రమాన్ని గురువారం ఆమె.. ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. పోలీస్ వృత్థి అంటేనే ఒత్తిడితో కూడుకున్నదని, ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే అధికారులకు, సిబ్బంది ఒత్తిడిని అధిగమించేందుకు ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యం కోసమే గేమ్స్‌తో పాటు పరేడ్, జిమ్ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నమన్నారు. పోటీల్లో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్లతోపాటు నల్లగొండ ఏఆర్ విభాగం జట్ల నుంచి సుమారు 300 మంది సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న స్పోర్ట్స్ మీట్‌లో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, షాట్‌ఫుట్ పోటీలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, ఎస్బీ డీఎస్పీ రమేష్, డీటీసీ డీఎస్పీ విఠల్‌రెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
పోలీసులు క్రీడాస్ఫూర్తిని చాటాలి
Comments
Please login to add a commentAdd a comment