మండలిలో మనది అగ్రస్థానం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: శాసన మండలిలో ఎమ్మెల్సీల సంఖ్యాపరంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అగ్రస్థానం దక్కింది. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరంతా ప్రత్యక్షంగా జిల్లా రాజకీయాల్లో ఉన్నవారే. ఇక బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికై న దాసోజు శ్రవణ్‌కు రాజకీయంగా నల్లగొండ జిల్లాతో పెద్దగా సంబంధం లేకపోయినా, పుట్టి పెరిగిందీ నల్లగొండ జిల్లా కేంద్రమే. దీంతో శాసన మండలిలో జిల్లాకు చెందిన ఎమ్మెల్సీల సంఖ్య ఏడుకు చేరుకుంది. కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్సీలు గురువారం ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు.
ఇదే మొదటిసారి..
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. శ్రవణ్ కాకుండా ఆరుగురు ఎమ్మెల్సీలు శాసన మండలిలో జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహించబోతున్నారు. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఉండగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మంకెన కోటిరెడ్డి ఉన్నారు. ఇప్పుడు కేతావత్ శంకర్‌నాయక్, అద్దంకి దయాకర్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్‌కుమార్ ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనమండలి పునరుద్ధరణ తర్వాత ఈ స్థాయిలో ప్రాతినిథ్యం దక్కడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవీకాలం 2027 నవంబరు 21వ తేదీతో ముగియనుండగా, తీన్మార్ మల్లన్న పదవీకాలం అదే సంవత్సరం మార్చి 29వ తేదీతో ముగియనుంది. మంకెన కోటిరెడ్డి పదవీ కాలం 2028 జనవరి 4వ తేదీతో ముగియనుండగా, కేతావత్ శంకర్‌నాయక్, అద్దంకి దయాకర్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్‌కుమార్ పదవీ కాలం 2029 మార్చి 29వ తేదీన ముగియనుంది.
ఫ శాసన మండలిలో ఉమ్మడి జిల్లాకు పెరిగిన ప్రాతినిథ్యం
ఫ ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు.. తాజాగా మరో ముగ్గురు ఎన్నిక
ఫ పుట్టిన స్థలం పరంగా.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ది కూడా ఇక్కడే
ఫ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారికంగా ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment