ప్రతిరోజూ గ్లాకోమా పరీక్షలు నిర్వహిస్తాం: డీఎంహెచ్‌ఓ
నల్లగొండ టౌన్: జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లోని కంటి విభాగంలో ప్రతిరోజూ గ్లాకోమా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ గ్లాకోమా వారోత్సవాల సందర్భంగా గురువారం నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లయిండ్ నెస్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య విద్యార్థులతో చేపట్టిన ర్యాలీని సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 వరకు నిర్వహించనున్న వారోత్సవాలు కొనసాగుతాయన్నారు. గ్లాకోమా పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ర్యాలీలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ మాతృనాయక్, కంటి విభాగం డాక్టర్లు సువర్ణ, మహేంద్ర, సాంబశివరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ నగేష్, డాక్టర్ కళ్యాణచక్రవర్తి, ఆర్తమాలజిస్టులు, మెడికల్ స్టాఫ్ జితేంద్ర, ప్రకాష్, కవిత, సరిత, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment