
నవోదయ ఫలితాలు విడుదల
జవహర్ నవోదయ విద్యాలయం(జేఎన్‌వీ) ఆరు, తొమ్మిది తరగతుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
పర్యావరణాన్ని కాపాడేలా..
పర్యావరణాన్ని కాపాడేలా పంటలు సాగుచేయాలని కంపాసాగర్ కేవీకే కోఆర్డినేటర్ శ్రీనివాసరావు అన్నారు.
- 8లో
వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు
నల్లగొండ టూటౌన్: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కుంభం నర్సిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 14ఏళ్లలోపు బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్, హ్యాండ్ బాల్, అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి పది వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడా శిక్షణ నిర్వాహకులకు గౌరవ వేతనంగా ఒక్కో శిబిరానికి రూ.4 వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. క్రీడా వివరాలు, గ్రామం, నిర్వహణ ప్రదేశం తెలియపరుస్తూ పూర్తి వివరాలతో వచ్చేనెల 5వ తేదీలోగా జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 9440072854 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
స్కూళ్లలో ఒకరోజు శాస్త్రవేత్త
నల్లగొండ: విద్యార్థులను బాల శాస్త్రవేత్తలుగా ప్రోత్సహించేందుకు అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఒకరోజు శాస్త్రవేత్త కార్యక్రమాన్ని నిర్వహించాలని డీఈఓ భిక్షపతి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులతో విద్యార్థులను ప్రత్యక్షంగా లేదా వర్చువల్ విధానంలో మాట్లాడించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి నివేదికను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏప్రిల్ 5లోగా సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి లక్ష్మీపతిని సంప్రదించాలని కోరారు.

నవోదయ ఫలితాలు విడుదల