
100వ ర్యాంకు సాధించిన ఏఓ
సంస్థాన్ నారాయణపురం: గ్రూప్– 1 ఫలితాల్లో సంస్థాన్ నారాయణపురం మండల వ్యవసాయధికారిణి వర్షితరెడ్డి ప్రతిభ చాటారు. బీఎస్సీ (అగ్రికల్చర్) పూర్తి చేసిన సంవత్సరంలోనే నాలుగు ఉద్యోగాలు సాధించింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఈ ఉద్యోగాలు సాధించడం విశేషం. ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 100వ ర్యాంకును సాధించింది. ఈమె 10వ తగరతి వరకు విద్యాభ్యాసం వికారాబాద్‌లో, ఇంటర్ హైదారబాద్‌లో, బీఎస్సీ(అగ్రికల్చర్) ఏపీలోని మహానందిలోని సాగింది. గ్రూప్స్ కోసం పక్కా ప్లానింగ్‌తో చదవానని పేర్కొంది.
సత్తాచాటిన జువేరియా
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డ కాలనీకి చెందిన జువేరియా గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 166వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు మౌజంఅలీ, అమీనాబి రెండవ కూతురైన జువేరియా హైదరాబాద్ కోటి ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసింది. గ్రూప్–1 ఫలితాల్లో 465.5 మార్కులు సాధించింది. ప్రతిరోజు 10–12 గంటలు చదువు కొనసాగించానని, ఎక్కడ కోచింగ్ తీసుకోకుండానే గ్రూప్–1 సాధించడం సంతోషంగా ఉందని తెలిపింది.

100వ ర్యాంకు సాధించిన ఏఓ