వైఎస్సార్‌సీపీ నాయకుడిపై దాడి
కృష్ణగిరి: మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు సురేంద్రకుమార్ (సుభాష్)పై ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు దామోదర్‌నాయుడు దాడికి పాల్పడ్డాడు. గ్రామస్తులు, బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం మధ్యాహ్నం సుభాష్ తన బైక్‌పై మరో వ్యక్తితో కలిసి వెల్దుర్తికి వెళ్తుండగా కృష్ణగిరి పోలీస్‌స్టేషన్ వెళ్లే రహదారి వద్ద దామోదర్‌నాయుడు సుభాష్ బైక్ నిలిపి దాడికి పాల్పడ్డాడు. వెంటనే అతను ఆత్మ రక్షణ కోసం ఎదురుదాడికి దిగగా.. ఇంతలో టీడీపీకి చెందిన మరో వ్యక్తి అడివయ్య రాళ్లతో సుభాష్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో ఇరువురికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు వచ్చి ఇద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. గతేడాది కూటమి పార్టీ గెలిచిన వెంటనే ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అధికారపార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment