కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో బీసీ కులగణనపై ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు స్థానిక బీసీ భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ నక్కలమిట్ట శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కులగణనతో పాటు రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన మేధావులు, బీసీ సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల్లోని బీసీ నేతలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment