అరకొర యూరియా.. అన్నదాత అవస్థలు
రైతులు పండించిన పంటలకు మార్కెట్‌లో మద్దతు ధర రావడం లేదు. వ్యవసాయ సీజన్‌కు కనీసం పెట్టుబడి సాయం కూడా అందడం లేదు. అవసరమైన ఎరువులు ఇవ్వడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రైతు సేవా కేంద్రాలకు అరకొర యూరియా ఇస్తోంది. దీంతో ప్రైవేటు దుకాణాల వద్దకు వెళ్లి అన్నదాతలు అదనపు ధర చెల్లించి యూరియా తీసుకోవాల్సి వస్తోంది. రుద్రవరం మండల పరిధిలోని కోటకొండ రైతు సేవా కేంద్రానికి స్వల్పంగా 260 యూరియా బస్తాలు వచ్చాయి. అక్కడికి బుధవారం రైతులకు భారీగా తరలిరాగా.. ఒక్కొక్కరికి కేవలం మూడు బస్తాలు ఇచ్చారు. ఖరీఫ్‌లో తీవ్రంగా నష్టపోయామని, రబీలో వరి, మినుము, మొక్కజొన్న వేసినా యూరియా స్వల్పంగా ఇచ్చారని రైతులు అసహనం వ్యక్తం చేశారు. – రుద్రవరం
అరకొర యూరియా.. అన్నదాత అవస్థలు
Comments
Please login to add a commentAdd a comment