జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి
● జిల్లా కలెక్టర్‌ను కోరిన ఏజీ ఎన్‌జీఓ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్‌రెడ్డి
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు వీలుగా సత్వరం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషాను ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ వీసీహెచ్ వెంగళ్‌రెడ్డి కోరారు. జేఏసీ ప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టర్‌ను ఆయన చాంబరులో కలసి వివిధ సమస్యలపై చర్చించారు. అలాగే వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెంగళ్‌రెడ్డి మాట్లాడుతూ... కొన్ని నెలలుగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగడం లేదన్నారు. ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్ వినియోగంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కలెక్టర్‌ను కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 6, 7 తేదీల్లో మహిళాఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్‌లు ఇవ్వాలని సూచించారు. కర్నూలు నగర శాఖ అధ్యక్షుడు ఎంసీ కాశన్న, జిల్లా సహ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వం నర్సెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లీలావతి, బంగారి, వెటర్నరీ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మద్దిలేటి, ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, నగర కార్యవర్గ సభ్యులు సాయిరాం, రాఘవేంద్ర, చలపతి, మునీర్ అహ్మద్, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment