కల సాకారమైన వేళ..
బేతంచెర్ల పట్టణం దుర్గాపేట కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ శేషాద్రి, నాగలక్ష్మి దంపతుల మూడవ కుమార్తె నిర్మల ఎస్‌ఐ ట్రైనింగ్ ఇంటికి చేరుకోవడంతో ఆ ఇంట సంతోషం వెల్లివిరిస్తోంది. నిర్మల వెల్దుర్తిలోని బాల యోగి గురుకుల పాఠశాలలో 10వ తరగతి వరకు, కోవెలకుంట్ల ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియెట్, విజయవాడలో బీటెక్ పూర్తి చేశారు. తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా గ్రూప్–1, గ్రూప్–2 కోచింగ్ తీసుకుంటూ ఎస్‌ఐ ప్రవేశ పరీక్ష రాసి సివిల్ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. అనంతరం అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆమె పోస్టింగ్ పొందారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను అభినందించారు. ‘పేదరికం చదువుకు అడ్డుకాదని, పట్టుదలతో లక్ష్యానికి చేరుకోవచ్చు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎస్‌ఐ ఉద్యోగం సాధించాను. పేదలకు మెరుగైన సేవలు అందిస్తా’నని ఎస్‌ఐ నిర్మల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment