సాయం.. ‘తులసీ’ వ్రతం
‘‘ సమాజంలోని అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి.. అవసరమైన సందర్భాల్లో సహాయ సహకారాలు అందించాలి.. ఇందుకు మహిళలు ముందుండాలి’’ అని అంటున్నారు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే తులసీదేవి. తమది ఉన్నత కుటుంబమైనా, కొన్ని పరిస్థితులతో బాల్యంలో పలు కష్టాలను చవిచూడాల్సి వచ్చిందని, అమ్మ నేర్పిన క్రమశిక్షణ, చదువుపై ఆమెకున్న శ్రద్ధ, పట్టుదలే తమను ఇంతవాళ్లను చేశాయని ఆమె పేర్కొన్నారు. ‘‘ అమ్మ, నాన్న ప్రాథమిక విద్యతోనే చదువు ఆపేసినా, నన్ను, అన్నను ఉన్నత విద్యావంతులను చేశారు. నాకున్న ఇద్దరు సంతానాన్ని అమ్మ వద్దే ఉంచి చదివించాం. బాబు నిఖిల్, పాప ప్రీతి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. మా వారు కే మల్లికార్జునరెడ్డి హైదరాబాద్‌లో ఓ మల్టీనేషనల్ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగంలో నిజాయితీ ముఖ్యం.’’ అని ఆమె అన్నారు. – కర్నూలు(అర్బన్)
Comments
Please login to add a commentAdd a comment