ప్రేమ‘జంట’గా.. హృదయం బరువెక్కగా!
బొమ్మలసత్రం: బేతంచర్ల మండలం బుగ్గానిపల్లె తండాకు చెందిన రాజేష్‌నాయుడు, మాధురిబాయి ఎదురెదురు ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఒకే ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఇద్దరూ కనిపించకుండా పోయా రు. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు ఆరా తీస్తే విషయం బయటపడింది. మాధురిబాయి తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన విన్నపం మేరకు త్రీటౌన్ పోలీసులు బుధవారం రాత్రి ప్రేమ జంటను స్టేషన్‌కు రప్పించారు. అయితే ఇరువురూ ఇష్టపూర్వకంగా వెళ్లినట్లు రాత పూర్వకంగా అంగీకరించారు. గురువారం ఉదయం తిరిగి ఇరువురి తరపు బంధువులు స్టేషన్‌లో పంచాయితీ పెట్టినా ఫలితం లేకపోయింది. ఈ విషయమై శుక్రవారం ఉదయం గ్రామంలో యువకుడి ఇంటి ముందు తమ కుమార్తెను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు గగ్గోలు పెట్టారు. సమాచారం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వరరావు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు.
టూటౌన్ పోలీస్టేషన్‌లో
మూడో రోజు..
ఇదిలా ఉండగా గ్రామం నుంచి పంచాయితీ కోసం వచ్చిన ఇరువురి కుటుంబాలను పోలీసులు టూటౌన్‌కు రప్పించారు. అక్కడ సీఐ ఇస్మాయిల్, త్రీటౌన్ సీఐ కంబగిరిరాముడు కలిసి ప్రేమ జంటను పెద్దల ఎదుట నిలబెట్టారు. యువతి తను ప్రేమించిన యువకుడితోనే వెళ్లిపోతానని తెగేసి చెప్పడంతో యువతి తండ్రి కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బీటెక్ విద్యార్థుల ప్రేమ ‘పంచాయితీ’
మూడు రోజులుగా పోలీసుస్టేషన్ చుట్టూ ఇరు కుటుంబాలు
అమ్మాయికి నచ్చజెప్పేందుకు తండ్రి కన్నీటి పర్యంతం
అబ్బాయితోనే ఉంటానని తేల్చిచెప్పిన యువతి
బరువెక్కిన హృదయంతో వెనుతిరిగిన తండ్రి
మూడు రోజులుగా ఆ తండ్రి వేదన వర్ణనాతీతం. కంటికి రెప్పలా చూసుకున్న కుమార్తె నిన్న మొన్న పరిచయమైన ప్రేమకునితోనే ఉంటానని చెప్పడం ఆ హృదయాన్ని కలచివేసింది. కాళ్లావేళ్లా పడినా.. వాళ్లతో వీళ్లతో చెప్పించినా.. కుమార్తె మనసు కరగకపోవడంతో ఆ తల్లిదండ్రుల మనసు గాయపడింది.
ప్రేమించడం తప్పుకాదు.. పెళ్లి చేసుకోవడం నేరం అంతకన్నా కాదు. కానీ పెద్దలను ఒప్పించి చేసుకున్నప్పుడే ఆ ప్రేమకు పరిపూర్ణత చేకూరుతుంది. ఇటీవల కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎన్నో జంటలు చిన్న చిన్న వివాదాలతో ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లడం చూస్తే.. ఏ తల్లిదండ్రులకై నా ప్రేమ పెళ్లి గుండెను బరువెక్కించక మానదు.
తెలిసీ తెలియని వయస్సులో ప్రేమలో పడటం.. జీవితంలో స్థిరపడకుండానే పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం తమ విజయంగా భావించడం యువతకు పరిపాటిగా మా రింది. ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తె సంతోషాన్నే కోరుకుంటారు. ఆడ..పిల్ల అయినప్పటికీ ఆ గజ్జెల సవ్వడితో మురిసిపోతారు. ఇలాంటి అమ్మానాన్నలు.. ప్రేమ వాకిట్లో కానివాళ్లుగా మారిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రేమ‘జంట’గా.. హృదయం బరువెక్కగా!
Comments
Please login to add a commentAdd a comment