బహుళ ప్రయోజనాల లక్ష్యంతో నెలకొల్పి న చెత్త సంపద కేంద్రా
ఆళ్లగడ్డ: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో చెత్త సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. రూ.కోట్లు పెట్టి నిర్మించిన షెడ్లు దిష్టి బొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో 28 మండలాల పరిధిలో 488 గ్రామ పంచాయతీలు ఉండగా 363 పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ చేసే కేంద్రాలు నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటికి గ్రామీణ ఉపాధిహామీ నిధుల నుంచి సుమారు రూ 33.12 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించినట్లు సమాచారం. చెత్త సేకరణకు జనాభా ప్రాతిపదికన కార్మికులను నియమించారు. పంచాయతీలకు ట్రాక్టర్లు, ఆటోలు, రిక్షాలను ఏర్పాటు చేశారు. కార్మికులకు నెలకు రూ. 6 వేల వేతనంతో పాటు వాహనాల డీజిల్‌కు ఖర్చు చేస్తున్నారు. ఇంటింటా రెండు చెత్త బుట్టలు చొప్పున పంపిణీ చేశారు. క్షేత్రస్థాయిలో గ్రామ కార్యదర్శులు, మండల అధికారులు వాటి నిర్వహణ పట్టించుకోక పోవడంతో ఇలా నెలలా కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నా ఏ ఒక్క కేంద్రంలో కిలో ఎరువు తయారు చేసిన దాఖలాల్లేవు. ఇప్పటికై నా అధికారులు సమన్వయంతో దృష్టి సారిస్తే చెత్తతో సంపద తయారు చేయాలన్న పరమార్థానికి అర్థం.. పంచాయతీలకు ఆదాయం.. ప్రజలకు ఆరోగ్యం చేకూరుతాయని ప్రజలు కోరుకుటున్నారు.
ముక్కు మూసుకుని ర్యాలీలు..
గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజా ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. పారిశుద్ధ్య కార్యక్రమాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులు నిత్యం పర్యవేక్షించాలి. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడాలని ప్రతి మూడో శనివారం ప్రతి గ్రామంలో విద్యార్థులతో ర్యాలీలు, అనంతరం ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అయితే అధికారులు, పాలకులు కేవలం ప్రతిజ్ఞకే పరిమితమవుతున్నారు తప్పా.. వారు ర్యాలీ చేసే సమయంలో రహదారుల వెంట చెత్త కుప్పల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ అంబాసిడర్లను తొలగించి టీడీపీ కార్యకర్తలను నియమించుకుంది. దీంతో అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడి వస్తుందన్న భయంతో తమ ఎందుకులేనని అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
స్వచ్ఛ లక్ష్యం.. ఆచరణ శూన్యం
పారిశుద్ధ్యం పనులు ప్రతిజ్ఞకే
పరిమితం
మూలన పడిన చెత్త సంపద కేంద్రాలు
గ్రీన్ అంబాసిడర్లకు
సక్రమంగా అందని వేతనం
పేరుకు పోతున్న చెత్తకుప్పలు
బహుళ ప్రయోజనాల లక్ష్యంతో నెలకొల్పి న చెత్త సంపద కేంద్రా
బహుళ ప్రయోజనాల లక్ష్యంతో నెలకొల్పి న చెత్త సంపద కేంద్రా
బహుళ ప్రయోజనాల లక్ష్యంతో నెలకొల్పి న చెత్త సంపద కేంద్రా
Comments
Please login to add a commentAdd a comment