పుష్కరిణిలో మిరుమిట్లు గొలిపే వెలుగుల్లో
ప్రహ్లాదవరదుడి తెప్పోత్సవం
ఆళ్లగడ్డ: లాహిరి లాహిరి లాహిరిలో... ఓహో జగమే ఊయలగా.. అంటూ ప్రహ్లాదవరదుడు ఉభయ దేవేరులతో పడవలో మూడు రోజులగా అంగరంగ వైభవంగా జరిగిన తెప్పోత్సవం మంగళవారం రాత్రి కనులపండువలా ముగిసింది. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రహ్లాదవరద స్వాములను పల్లకీలో అధిష్టింపజేసి మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం కోనేటి వరకు తొడ్కొని వచ్చారు. ఉభయ దేవేరులతో స్వామి తెప్పను అధిరోహించిన అనంతరం పండితుల పూజలు చేశారు. అనంతరం సుమారు గంటపాటు తెప్పోత్సవం సాగింది. నారసింహ స్వామి కీర్తనలు భక్తి పారవశ్యంతో ఆలపిస్తుండగా.. ప్రహ్లాదవరదస్వామి ఉభయ దేవేరులతో తెప్పపై ఊరేగారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోనేటి చుట్టూ చేరుకుని తెప్పోత్సవాన్ని తిలకించారు.
వైభవోపేతంగా ముగిసిన
లక్ష్మీనృసింహస్వామి తెప్పోత్సవం
లాహిరి లాహిరి లాహిరిలో..