నదులు, వాగులు, వంకల్లో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తుంగభద్ర, హంద్రీ, కుందూ నదులు, వాగుల్లో ఇసుక కొల్లగొట్టడంతో పలు చోట్ల పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ గుంతల్లో నీరు నిల్వడంతో ఈత కొట్టేందుకు వెళ్లిన పిల్లలకు లోతు తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. పలు బావుల్లో పూడిక ఉండటం, ఎత్తైన చోటు నుంచి దూకినప్పుడు పూడికలో కూరుకపోయి చనిపోతున్నారు. అయితే ఇలాంటి ప్రదేశాల వద్ద ఎవరూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.