
తడిసిన రెక్కల కష్టం.. ఉరిమిన నష్టం
● దెబ్బతిన్న వరి, మిరప, మొక్కజొన్న దిగుబడులు ● కూలిన మామిడి చెట్లు
కోవెలకుంట్ల/బనగానపల్లె: వేసవికాలంలో కురిసే అకాల వర్షాలతో అన్నదాతకు నష్టమే మిగిలింది. జిల్లా లో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ప్రస్తుతం వరి కోత, నూర్పిడి పను లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ధాన్యాన్ని రైతు లు కల్లాల్లో, రహదారులపై ఆరబోసుకున్నారు. మిరపలో చివరి కోత మిరపకాయలను ఎండబెట్టుకున్నా రు. అకాల వర్షం పడటంతో కొన్ని ప్రాంతాల్లో ధాన్యం తడిచిపోగా మిగిలిన చోట్ల దిగుబడులు వర్షానికి తడవకుండా పట్టలు కప్పుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. వరి, మిరప, మొక్కజొన్న, పొగా సాగు చేసిన రైతులు అకాల వర్షంతో నష్టాన్ని చవిచూశారు.
బనగానపల్లె మండలంలో
పసుపల. పెద్దరాజుపాళెం, చిన్నరాజుపాళెం, తండా గ్రామాల్లో శుక్రవారం సాయంకాలం కురిసిన వర్షంతో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న తడిసిపోయింది. బనగానపల్లె ప్రాంతంలో వీచిన పెనుగాలులకు వరి పైరు నేలవాలింది. మార్కెట్‌లో పంటకు గిట్టుబాటు ధర లేదని,అకాల వ ర్షంతో నష్టం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.3లక్షల నష్టం
బనగానపల్లె మండలం చిన్నరాజుపాళెం తండా సమీపంలో ఉన్న 45 మామిడి చెట్లు కూలిపోయాయాయి. వర్షంతోపాటు భారీగాలులతో మద్దిటినాయక్‌కు చెందిన 30, ఈశ్వర్ నాయక్‌కు చెందిన 15 మామిడి చెట్లు వేర్లతో సహా నేల కూలాయి. దీంతో రూ.3లక్షల నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. ప్రభుత్వం ఆదు కోవాలని తోటల యజమానులు కోరుతున్నారు.

తడిసిన రెక్కల కష్టం.. ఉరిమిన నష్టం

తడిసిన రెక్కల కష్టం.. ఉరిమిన నష్టం