మహారాష్ట్ర బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
నారాయణపేట: బీహార్, యూపీ, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నుంచి చాలామంది ఉపాధి కోసం తెలంగాణకు వలస వస్తున్నారని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. నా అన్నదమ్ములు ఇక్కడ ఉన్నారని వచ్చాను.. ఓట్ల కోసం రాలేదని అన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా శనివారం ముంబైలోని వాషి సెక్టార్–16లోని విష్ణుదాస్ భవే ఆడిటోరియంలో నిర్వహించిన గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఊరేగింపుగా వెళ్లి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అలాగే బీఆర్‌ఎస్ పార్టీ స్థానిక నాయకులు హాజరయ్యారు. ముంబై, పూణె, బెంగళూర్, సూరత్ వంటి మహానగరాల్లో స్థిరపడిన, వివిధ రంగాల్లో రాణిస్తున్న తెలంగాణ ప్రజలు మీ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి కలిసి రావాలని కోరారు. ఆదివారం పూణెలో, రానున్న రోజుల్లో బెంగళూర్, సూరత్ వంటి ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తామని చెప్పారు.
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా గిరిజన దినోత్సవాన్ని ముంబైలో నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. పెద్దఎత్తున ఆదరణ వస్తోందని అన్నారు. తెలంగాణలో వలసలకు ప్రతిపక్ష పార్టీలే కారణమని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీని ఆదరిస్తే, అండగా ఉంటామని, ఏ సమస్య ఉన్నా క్షణాల్లో పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నారాయణపేట నియోజకవర్గం నాయకులు రవికుమార్, వేపూరి రాములు, మురళీధర్‌రెడ్డి, ఎ.శ్రీనివాస్‌రెడ్డి, మల్లయ్య యాదవ్, మహేశ్, బుల్లెట్ రాజు, సిద్దు చౌహన్, రమేశ్‌నాయక్, మాధవరెడ్డి, ప్రసాద్‌బాబు, లక్ష్మణ్‌నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment