Shivaji Maharaj
-
మానవత్వం.. మంటగలిసిన వేళ, ఎయిరిండియాపై తీవ్ర విమర్శలు
మానవత్వం మంటగలిసింది. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా పరోక్షంగా ఓ ప్రయాణికుడు ప్రాణం పోయేందుకు కారణమైనట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. అమెరికా న్యూయార్క్ నుంచి ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ 80 ఏళ్ల ప్రయాణికుడు కుప్పకూలాడు. ఆపై ప్రాణాలొదిలాడు. అయితే ఈ విషాదానికి ముందు ఎయిరిండియా విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ ప్రదేశం నుంచి టెర్మినల్ వరకు సుమారు.1.5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చాడు సదరు ప్రయాణికుడు. వయో భారం దృష్ట్యా ల్యాండింగ్ తర్వాత ఎయిరిండియా సిబ్బందిని తనకు వీల్ చైర్ ఇవ్వాలని కోరాడు. కానీ వీల్ చైర్ కొరత ఉండడంతో తాము ఇవ్వలేమని తిరస్కరించారు. చేసేది లేక కిలోమీటర్ దూరం నడుచుకుంటూ టెర్మినల్‌కు చేరుకున్న ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదంతో ప్రయాణికుల పట్ల ఎయిరిండియా సిబ్బంది వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఎయిరిండియా యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అప్పటికే తాము బాధితుడి భార్యకు వీల్ ఛైర్ కేటాయించామని, తనకూ మరో వీల్ ఛైర్ కావాలని కోరడంతో.. ప్రయాణికుల రద్ది కారణంగా వీల్ ఛైర్ ఇచ్చేందుకు కొద్ది సమయం పడుతుందని, అప్పటి వరకు వేచి చూడాలని కోరినట్లు తెలిపింది. కానీ ప్రయాణికుడు మాత్రం తన భార్యతో కలిసి నడుచుకుంటూ టెర్మినల్‌లోకి వచ్చినట్లు వెల్లడించింది. ప్రయాణికుడు టెర్మినల్‌లో స్పృహ కోల్పోయిన వెంటనే ఎయిర్‌పోర్ట్‌కి చెందిన మెడికల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని, నిమిషాల వ్యవధిలో స్థానిక ఆస్పత్రికి తరలిచారు. అప్పటికే ప్రయాణికుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని ఎయిరిండియా యాజమాన్యం వివరణ ఇచ్చింది. చదవండి👉 : ఎయిరిండియాకు ఏమైంది? ‘వెజ్ మీల్స్‌లో చికెన్ ముక్కలు’! -
తండాల అభివృద్ధి కేసీఆర్ ఘనతే
నారాయణపేట: బీహార్, యూపీ, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నుంచి చాలామంది ఉపాధి కోసం తెలంగాణకు వలస వస్తున్నారని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. నా అన్నదమ్ములు ఇక్కడ ఉన్నారని వచ్చాను.. ఓట్ల కోసం రాలేదని అన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా శనివారం ముంబైలోని వాషి సెక్టార్–16లోని విష్ణుదాస్ భవే ఆడిటోరియంలో నిర్వహించిన గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఊరేగింపుగా వెళ్లి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు హాజరయ్యారు. ముంబై, పూణె, బెంగళూర్, సూరత్ వంటి మహానగరాల్లో స్థిరపడిన, వివిధ రంగాల్లో రాణిస్తున్న తెలంగాణ ప్రజలు మీ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కలిసి రావాలని కోరారు. ఆదివారం పూణెలో, రానున్న రోజుల్లో బెంగళూర్, సూరత్ వంటి ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా గిరిజన దినోత్సవాన్ని ముంబైలో నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. పెద్దఎత్తున ఆదరణ వస్తోందని అన్నారు. తెలంగాణలో వలసలకు ప్రతిపక్ష పార్టీలే కారణమని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తే, అండగా ఉంటామని, ఏ సమస్య ఉన్నా క్షణాల్లో పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నారాయణపేట నియోజకవర్గం నాయకులు రవికుమార్, వేపూరి రాములు, మురళీధర్‌రెడ్డి, ఎ.శ్రీనివాస్‌రెడ్డి, మల్లయ్య యాదవ్, మహేశ్, బుల్లెట్ రాజు, సిద్దు చౌహన్, రమేశ్‌నాయక్, మాధవరెడ్డి, ప్రసాద్‌బాబు, లక్ష్మణ్‌నాయక్ పాల్గొన్నారు. -
ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యల దుమారం... ఏక్నాథ్ షిండ్‌పై విమర్శలు
ముంబై: ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అలా ఎలా చూస్తూ... కూర్చొన్నారంటూ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. గవర్నర్ భగత్ సింగ్‌ని తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అసలు షిండే మహారాష్ట్ర బిడ్డేనా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండ్‌ని కూడా రాజీనామ చేయాలంటూ డిమాండ్ చేశారు. గవర్నర్ భగత్ సింగ్ ఈ ఏడాది వ్యవధిలో నాలుగుసార్లు ఛత్రపతి శివాజీని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారన్నారు రౌత్. అయినా మహారాష్ట్ర ప్రభుత్వ మౌనంగానే ఉందంటూ విరుచుకుపడ్డారు. ఆత్మగౌరవ నినాదం ఇచ్చి మరీ శివసేనను విచ్ఛిన్నం చేసి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన షిండేకు ప్రస్తుతం ఆ ఆత్మగౌరవం ఏమైందంటూ ఎద్దేవా చేశారు. ఇంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు కూడా శివాజీ మహారాజ్ ఔరంగజేబుకు ఐదు సార్లు క్షమాపణలు చెప్పారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలకు మహారాష్ట్రకు క్షమాపణ చెప్పడమే కాకుండా తక్షణమే గవర్నర్‌ని తొలగించాలి అని ఒత్తిడి చేశారు . తాము కాంగ్రెస్ నాయకుడు రాహల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా వీర సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించి తమ పార్టీ నిరసన తెలిపిందని గుర్తు చేశారు. బీజేపీ బహిరంగంగానే శివాజీ మహారాజ్‌ని పలుమార్లు విమర్మించిందన్నారు. కాబట్టి షిండే రాజీనామ చేయాలని, బీజేపీతో కలిసి ప్రభుత్వంలో కొనసాగకూడదంటూ సీరియస్ అయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఔరంగాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.... శివాజీ మహారాజ్ పాత విగ్రహాలు అయిపోయాయని, ఇప్పుడూ మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ నితిన్ గడ్కరీ వంటి వారెందరో అందుబాటు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఉద్ధవ ఠాక్రే వర్గానికి చెందిన వ్యక్తులకు గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు మింగుడుపడం లేదు. దీంతో గవర్నర్ గొప్ప గొప్ప వ్యక్తులను అగౌరవపరిచే వ్యక్తి అంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు. రాహుల్ వీర సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ బూట్లతో దాడి చేస్తోంది. మరీ ఇప్పుడూ గవర్నర్ చేసిన పనికి రాజ్‌భన్‌పైకి చెప్పులతో వెళ్లాలంటూ మండిపడ్డారు. గవర్నర్ వ్యాఖ్యలు ప్రకారం కృష్ణుడు, రాముడు పాత్ర విగ్రహాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడూ మనం కొత్త దేవతలను ఆరాధించాలా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. అలాగే శివసేన పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ దూబే ఛత్రపతి శివాజీ మహారాజ్ మా ఆరాధ్యదైవం మాత్రమే కాదు, ఎప్పటికీ అందరికి ఆదర్శప్రాయుడని అన్నారు. (చదవండి: రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్‌తో శివసేన తెగదెంపులు?) -
శివాజీ మహరాజ్ ఫొటో వివాదం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ
సాక్షి, తిరుమల: తిరుమలలో శివాజీ మహరాజ్ ఫొటో వివాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్పందించింది. శివాజీ ఫొటోను ఎవరూ అడ్డుకోలేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. కొందరు అత్యుత్సాహంతో టీటీడీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు పుకార్లను నమ్మవద్దని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై మండిపడ్డారు. ఇది కూడా చదవండి: ఒక్క ఫొటో నా జీవితాన్నే మార్చేసింది: మంత్రి ఆర్కే రోజా -
నన్ను అంతం చేసే కుట్ర ఎమ్మెల్యే రాజాసింగ్
కల్హేర్(నారాయణఖేడ్): ధర్మం కోసం పని చేస్తున్న తనను అంతం చేసేందుకు కొన్నిశక్తులు కుట్ర చేస్తున్నాయని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గరిడెగాంలో ఆదివారంనాడు శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తన నోరు మూయించాలని చూస్తే.. వంద మంది రాజాసింగ్‌లు పుట్టుకొస్తారన్నారు. కొందరు విదేశాల నుంచి డబ్బు పంపి మతమార్పిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన చంద్రశేఖర్ మహరాజ్, మాజీ ఎమ్మెల్యేలు విజయపాల్‌రెడ్డి, గంగారం, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆలె భాస్కర్ పాల్గొన్నారు. -
శివాజీపై కర్ణాటక డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
బెలగావి: ఛత్రపతి శివాజీ మహరాజ్ కన్నడ వ్యక్తి అని కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్ కార్జోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు సమస్యపై చాలా రోజులుగా మహా రాష్ట్ర, కర్ణాటక అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదటగా బెల్గావ్, కార్వార్ కర్ణాటకలోనివి కాదని, మహారాష్ట్రవని సీఎం ఉద్ధవ్‌ఠాక్రే వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. ఆ వెంటనే ఆర్థిక రాజధాని ముం బై కర్ణాటకది అని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం లక్ష్మణ్ వివాదాన్ని మరింత పెద్దది చేశారు. దీంతో ఎన్సీపీ నేతలు రంగంలోకి దిగి లక్ష్మణ్‌పై విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు తుది తీర్పువచ్చే వరకు కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కేంద్ర భూభాగంగా ప్రకటించాలని ఉద్ధవ్ ఇటీవల డిమాండ్ చేశారు. దీంతో కర్ణాటకకు చెందిన ఇద్దరు ఉప ముఖ్య మంత్రులు ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. కరువు వస్తే మహారాష్ట్రకు వచ్చారు.. ఛత్రపతి శివాజీ మహారాజ్ ’కన్నడిగ’ అని డిప్యూటీ సీఎం గోవిద్ ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రేకు చరిత్ర తెలియదని, శివాజీ పూర్వీకుడు బెల్లియప్ప కర్ణాటకలోని గడగ్ జిల్లా సోరటూర్‌కు చెందినవాడని పేర్కొన్నారు. గడగ్‌లో కరువు వచ్చినపుడు బెల్లియప్ప మహారాష్ట్రకు బయలుదేరాడని డిప్యూటీ సీఎం తెలిపారు. శివాజీ నాల్గవ తరానికి చెందిన వ్యక్తి అని గోవింద్ వ్యాఖ్యానించారు. శివసేన గుర్తుగా, పార్టీ పేరుగా పెట్టుకున్నది ఒక కన్నడ వ్యక్తి శివాజీది అని పేర్కొన్నారు. ఉద్ధవ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో గొడవలపై ప్రజల దృష్టిని మళ్లించడానికి బెల్గావ్ సమస్యను లేవనెత్తాడని కార్జోల్ ఆరోపణలు గుప్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వం వివిధ అంశాల్లో విఫలమైందని ఉద్ధవ్ ప్రజాధరణ కోల్పోతున్నాడని మరో డిప్యూటీ సీఎం లక్ష్మణ్ ఆరోపించారు. ముంబై కర్ణాటకలో భాగం కావాలని, లేదా కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని లక్ష్మణ్ డిమాండ్‌చేశారు. స్వేచ్ఛ కోసం కిట్టూర్ రాణి చెన్నమ్మ బ్రిటిష్ వారిపై సాయుధ తిరుగుబాటుకు దారితీసిన భూమి బెల్గావి అని బెలగావి జిల్లాకు చెందిన మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శశికళ జోల్లె వ్యాఖ్యానించారు. -
ముస్లింలు నా ఆఫీసుకు రావద్దు
సాక్షి, బళ్లారి: ‘బుర్కా, టోపీ ధరించిన ముస్లింలు నా ఆఫీసుకు రావద్దు. వారు నాకు ఓటు వేయాల్సిన అవసరం లేదు’ అని కేంద్ర మాజీ మంత్రి, విజయపుర బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ వ్యాఖ్యానించారు. ఈ నెల 4న విజయపురలోని సిద్దే«శ్వర కళాభవన్‌లో శివాజీ మహారాజ్ జయంత్యుత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందువుల సంక్షేమం కోసమే పని చేయాలని, ముస్లింలకు పనులు చేయవద్దని ఈ సందర్భంగా ఆయన నగర కార్పొరేటర్లకు సూచించారు. ముస్లింలను తన ఆఫీసులోకి రానివ్వద్దని, తన పక్కన కూర్చొనివ్వరాదని ఆఫీసు సిబ్బందికి చెప్పారు. -
ఆ బలం గురువుదే!
నీటి ఒడ్డున ఇసుకలో తాబేలు గుడ్లుపెడుతుంది. తర్వాత వాటిని ఇసుకతో కప్పేసి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. తరువాత ఆ గుడ్లను గురించి ఆలోచిస్తూ అవి పిల్లలు కావాలనుకుంటుందట. తాబేటి స్మరణబలం చేత ఆ గుడ్లు పొదగబడి పిల్లలవుతాయి. అది స్మరణదీక్ష. గురువుగారు ఒక్కసారి స్మరిస్తారు. స్మరణబలంతో శిష్యుడిని అనుగ్రహిస్తారు. శివాజీ మహరాజ్ అహంకారంతో వ్యవహరిస్తున్నాడని తెలుసుకున్న ఆయన గురువు సమర్ధ రామదాసు ఒక్కసారి శిష్యుణ్ణి స్మరించారు. శివాజీకి గురువుగారిని చూడాలనిపించి వెళ్ళి కలిసాడు. వచ్చిన శిష్యుడిని చూసొ ‘శివాజీ! చాలా బలమున్నవాడివి కదూ, ఇన్ని రాజ్యాలు ఏర్పాటు చేసావు కదూ, నీకు నీవు చాలా గొప్పవాడిననుకుంటున్నావు కదూ !’ అని ఓ నల్లరాయిని చూపించి ‘ఏదీ దాన్ని బద్దలు కొట్టు’ అన్నాడు. వెంటనే శివాజీ ‘గురువుగారి ఆజ్ఞ’ అంటూ దానిని బద్దలుకొట్టాడు. దానిలోపల కాసిన్ని నీళ్ళు, ఆ నీళ్ళలోంచి ఒక కప్ప బయటపడ్డాయి. తెల్లపోయిన శివాజీ ‘నల్లరాయిలో నీళ్ళు, ఆ నీళ్ళలోకి ఈ కప్ప ఎలా వచ్చాయి!’ అని అడిగాడు. ‘రాతిలో నీళ్లుంచి ఆ నీళ్ళలో కప్పనుంచినవాడే నిన్నిక్కడ ఉంచి నీలో బలం కూడా ఉంచాడు. ఆ బలం నీదికాదు’ అన్నారు గురువుగారు. ‘గురువుగారూ, అర్థమయింది. నేను అహంకరించాను. నన్ను మన్నించండి’ అన్నాడు. స్మరణచేత అనుగ్రహిస్తారు గురువులు. ఇవన్నీ గురువు శిష్యుడిని అనుగ్రహించే లేదా ఉపదేశం చేసే విధానాలు. అందుకే అంతేవాసిత్వం అంటారు. ఎప్పుడూ గురువు చెంత ఉండి సేవచేస్తూ, శిష్యుడు గురువు మనసులోస్థానం సంపాదిస్తాడు. వాడు నామాట వింటున్నాడని తెలుసుకున్న గురువు ఏ శిష్యుడిపట్ల ప్రీతిపొందుతాడో అతనిని అంతేవాసి అంటారు. ఆ ప్రక్రియను అంతేవాసిత్వం అంటారు. ఇది గురుశిష్యుల మధ్య ఉండే అద్భుతమైన అనుబంధం. శిష్యుడికి గురువుగారికన్నా గొప్పది ఈ ప్రపంచంలో మరేదీ లేదు. గురువుగారు స్నానం ముగించి రాగానే పంచె చేతికి అందిస్తాడు. గడపదాటంగానే చెప్పుల జత తీసుకొచ్చి అక్కడ పెడతాడు. అదేమిటి చెప్పులు మోస్తున్నాడని గింజుకోనక్కరలేదు. ఆయనకు గురువుకన్నా అధికుడు లేడు. పరమేశ్వరుడి పాదాలకు పాదుకలు అమర్చుతున్నాడంతే. అదే శిష్యుడి భావన. ఆ సంస్కారం అర్థం చేసుకోవాలి. అలా సేవలు చేయించుకోవాలని గురువుగారికి మోజేమీ ఉండదు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం. అది శిష్యుడి వినయం. ఒకసారి విశ్వామిత్రుడు ‘రామలక్ష్మణులారా !’ అని ఎందుకో పిలిచాడు. ఆ పిలుపులో ఏదో గౌరవభావం ఉందనిపించింది రాముడికి. ఎందుకని! మారీచుడిని మారణాస్త్రంతో కొట్టాడు. రాక్షస సంహారం చేసాడు. ఇదంతా చూసి ఇంద్రాదులు ప్రశంసలతో ముంచెత్తారు. రాముడిలో ఇదంతా ఏమయినా మార్పు తీసుకొచ్చిందేమోనన్న సందేహంతో ఆ పిలుపులో తేడా ఏమయినా వచ్చిందా! ఏమో! రాముడికి మాత్రం అనుమానమొచ్చిన మరుక్షణం చేతులు కట్టుకుని వచ్చి ‘‘గురువుగారూ! మీరు శాసకులు, మీరు పరబ్రహ్మ. మీరు మర్యాదగా పిలవకూడదు. మీరు శాసనం చెయ్యండి. అది చెయ్ అనండి. మీరు ఏది చెప్పారో అది చెయ్యడమే నా జీవితానికి సార్ధక్యం. మీ నుండి అభ్యర్థనను నా జీవితమందు వినకుండెదను గాక!’’ అన్నాడు. అదీ గురువును ఉపాసన చేయడం అంటే. చెయ్యకూడనిదేదీ గురువు చెప్పడు. గురుశిష్యుల అనుబంధం అంత అద్భుతంగా ఉంటుంది. ఆచార్యుడు ఎంతటి ప్రజ్ఞాశాలి అంటే–పరమేశ్వరుడి చేతిని శిష్యుడికి అందించగలడు. కారణం – భక్తితత్పరుడైన గురువు మాటకు పరమేశ్వరుడు కూడా వశవర్తి అయిపోతాడు. అంత పెద్ద ఏనుగు మావటికి లొంగిపోయి తనను కట్టడానికి ఇనుపగొలుసులను తొండంతో ఎత్తి మావటి చేతికి అందించినట్లు తనను అనువర్తించే శిష్యుడికి గురువు కూడా అలా వశవర్తి అయిపోతాడు.