
సాక్షి, తిరుమల: తిరుమలలో శివాజీ మహరాజ్ ఫొటో వివాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్పందించింది. శివాజీ ఫొటోను ఎవరూ అడ్డుకోలేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. కొందరు అత్యుత్సాహంతో టీటీడీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు పుకార్లను నమ్మవద్దని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: ఒక్క ఫొటో నా జీవితాన్నే మార్చేసింది: మంత్రి ఆర్కే రోజా