ఎన్నో సార్లు విన్నవించాం
రైతులు మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం అకాల వర్షాలతో తడిసిపోతుందని ఎన్నో సార్లు మార్కెట్ పాలకవర్గాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటికై న స్పందించి కవర్‌షెడ్‌లతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయడంతో రైతులకు శుభపరిణామంగా భావిస్తున్నాం. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరుతున్నాం.
– వెంకోభ, బీకెఎస్ రాష్ట్ర నాయకుడు,
నారాయణపేట
రైతుల ఇబ్బందులు తప్పాయి
రైతులు ప్రతి ఏటా ఆరుగాలం కష్టించి పంటను పండించడం ఒక ఎత్తు అయితే.. మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయించడం, తూకాలు వేయడం వరకు ఇబ్బందులు తప్పేవికాదు. గిట్టుబాటు ధరలు రాకపోతే అక్కడే ఉంచాలంటే భద్రత లేకపాయె. వచ్చిన ధరలకు అమ్మే పరిస్థితి. ఇప్పుడు సీసీ కెమెరాల ఏర్పాటుతో రైతులు నిశ్చింతగా ఉండొచ్చు.
– అంజిలయ్యగౌడ్, రైతు సంఘం నాయకులు
నారాయణపేట.
సంతోషంగా ఉంది
మార్కెట్‌కు రైతులు తెచ్చే ధాన్యాన్ని వ్యాపారస్తులు కొనుగోలు చేసిన తర్వాత వాటిని ఎత్తేంత వరకు ఆందోళన పడేవాళ్లం. ఎప్పుడైనా వర్షం వస్తే ఆ నష్టమంతా వ్యాపారస్తులపై పడేది. షెడ్ల నిర్మాణంతో ఇటు రైతులు, అటు కమీషన్ ఏజెంట్ల ఇబ్బందులు తప్పుతాయి. ధాన్యం తడవకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. సీసీ కెమెరాల ఏర్పాటుతో మా సరుకుపై నిఘా ఉంచినట్లు అవుతుంది.
– పవన్‌కుమార్ లహోటి,
గంజ్‌అసోసియేషన్ అధ్యక్షుడు
●
ఎన్నో సార్లు విన్నవించాం
Comments
Please login to add a commentAdd a comment