రేపు టెన్నికాయిట్ క్రీడాకారుల ఎంపిక
మక్తల్: జిల్లా టెన్నికాయిట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో మక్తల్‌లో 13వ తేదీన జిల్లా స్థాయి టెన్నికాయిట్ క్రీడాకారుల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.దీప తెలిపారు. పట్టణంలో సాయిజ్యోతి ఉన్నత పాఠశాల ఆవరణలో మహిళలు, పురుషులకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఆధార్‌కార్డు, బోనోపైడ్, మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాలని, ప్రతిభ కనబర్చిన వారిని ఈ నెల 15, 16 తేదీల్లో హన్మకొండలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు.
జొన్నలు క్వింటాల్ రూ.4,565
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం జొన్నలు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.4,565, కనిష్టంగా రూ.4,320 ధర పలికాయి. అలాగే, శనగలు గరిష్టం రూ.5,720, కనిష్టం రూ.5,659, పెసర గరిష్టం రూ.6,818, కనిష్టం రూ.6,606, అలసందలు గరిష్టం, కనిష్టం రూ.6,933, ఎర్ర కందులు గరిష్టం రూ.7,411, కనిష్టం రూ.4,350, తెల్ల కందులు గరిష్టంగా రూ.7,663, కనిష్టంగా రూ.6,759 ధరలు పలికాయి.
పీయూలో 27, 28 తేదీల్లో వర్క్‌షాప్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 27, 28 తేదీల్లో ఎంబీఏ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రీసెర్చ్ మెథడాలజీ, ప్రాజెక్టుపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్‌ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంబీఏ చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ వర్క్‌షాప్ ఎంతో ఉపయోగకరం అని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, కన్వీనర్ అర్జున్‌కుమార్, కో కన్వీనర్ నాగసుధ, జావిద్‌ఖాన్, అరుంధతి, గాలెన్న తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్ల ఖరారు తర్వాతే ఫలితాలివ్వాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి, వాటిని ఖరారు చేసే వరకు గ్రూప్–1, 2, 3 ఫలితాలను ప్రకటించవద్దని ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీయూ మెయిన్ గేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్న కొంత మంది స్వార్థపరుల ఒత్తిడి మేరకు మాదిగ విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీయాలన్న కుట్రతో ముందస్తుగా గ్రూప్స్ ఫలితాలను విడుదల చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణలో ఏబీసీడీ వర్గీకరణ అనంతరం మాత్రమే ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతామని ప్రభుత్వం చెబుతూనే ఫలితాల విడుదలకు కసరత్తు చేయడం బాధాకరమని, రిజర్వేషన్‌ల బిల్లు పెట్టి వర్గీకరణ చేసే వరకు నిరసన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్‌పీ అధ్యక్షుడు టైగర్ అంజయ్య, వీరస్వామి, జేఏసీ చైర్మన్ రాము, దాసు, శ్రీను, రవితేజ, రాము, నాగేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
యువతతోనే దేశ ప్రగతి
నాగర్‌కర్నూల్ క్రైం: యువతతోనే దేశప్రగతి ముడిపడి ఉందని, దేశ అభివృద్ధిలో యువత కీలకం అని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్ అన్నారు. కేంద్ర యువజన క్రీడా సర్వీసులు, మై భారత్, నెహ్రూ యువకేంద్ర సహకారంతో స్వామివివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మంగళవారం యువ ఉత్సవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్‌లో యువత పాత్ర ముఖ్యమైనదని, చదువుతోపాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులపై సోషల్‌మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని, సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ నెలలో జరగనున్న జాతీయ యూత్ పార్లమెంట్ వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం యువ ఉత్సవంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో ప్రతిభచాటిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, స్వామివివేకానంద సేవా బృందం అధ్యక్షుడు శివకుమార్, జిల్లా యువజన అధికారి కోటానాయక్, కల్యాణ్‌నాయక్, సుధాకర్, లక్ష్మీనర్సింహ, అజయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment