‘ఇంటర్’ వాల్యూయేషన్ ప్రారంభం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల వాల్యూయేషన్‌ను అధికారులు మంగళవారం ప్రారంభించారు. జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో వాల్యూయేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి 20 వేలకు పైగా సంస్కృతం సబ్జెక్టుకు సంబంధించిన జవాబుపత్రాలు క్యాంప్‌నకు చేరాయి. తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించిన జవాబుపత్రాలు ఒకట్రెండు రోజుల్లో రానున్నాయి. వీటికి అధికారులు కోడింగ్ ప్రక్రియ చేపట్టారు. మొత్తంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి రెండు లక్షలకు పైగా జవాబు పత్రాలు వచ్చే అవకాశం ఉంది. రెండు వారాల్లో వాల్యూయేషన్ పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంటర్ పరీక్షలకు 165 మంది గైర్హాజరు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షకు 165 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్తం 4975 మంది విద్యార్థులకుగాను 4810 మంది హాజరయ్యారు. అందులో జనరల్ విద్యార్థులు 4,383 మందికిగాను 4239 మంది హాజరయ్యారు. 144 మంది గైర్వాజరయ్యారు. ఒకేషనల్‌లో 592 మందికిగాను 571 మంది హాజరయ్యారు. 21మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సుదర్శన్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment