రోడ్లపైనే మార్కెట్లు..!
మక్తల్, మద్దూరులో రైతుబజార్లు లేక రోడ్లపైనే కూరగాయల విక్రయాలు
● పేట, కోస్గిలో మార్కెట్లు ఉన్నా..ప్రయోజనం సున్నా
● వ్యాపారులు పోటీపడి రోడ్లపైకి వచ్చికూరగాయలు, పండ్ల విక్రయాలు
● వినియోగదారులు,
వాహనదారుల ఇక్కట్లు
నారాయణపేట: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రోడ్లపైనే కూరగాయల విక్రయాలు సాగుతున్నాయి. నారాయణపేట, కోస్గిలో రైతుబజార్లు, షెడ్లు నిర్మించినా కూడా కూరగాయల వ్యాపారం మళ్లీ వీధికెక్కింది. నాలుగు మున్సిపాలిటీల్లో రోడ్లనే మార్కెట్లు చేసి వ్యాపారాలు నిర్వహిస్తూ అటు వినియోగదారులకు, ఇటు వాహనదారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎంత తాజాగా ఉన్నా.. రోడ్లపైనే దుమ్మూ దూళి మధ్య విక్రయించడంతో ఎక్కడ అనారోగ్యం బారిన పడతామోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూ.లక్షలు వెచ్చించి నిర్మించినా..
జిల్లా కేంద్రమైన నారాయణపేట నడిబొడ్డున కూరగాయల మార్కెట్ ఉంది. కూరగాయల మార్కెట్ దుకాణాల సముదాయం ఉండగా 2018లో గత ప్రభుత్వ హయాంలో రైతు బజార్‌ను రూ.68 లక్షలతో 16 దుకాణాలు, షెడ్లను నిర్మించారు. రైతులు పండించిన కూరగాయలను స్వయంగా విక్రయించుకుని లబ్ధి పొందేందుకు రైతు బజార్‌ను ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతంలో రైతులు తెల్లవారు జామున 4గంటల నుంచి 7 వరకు విక్రయించుకొని వెళ్తుంటారు. ఆ తర్వాత రైతు బజార్ వెలవెలబోతుంది. కూరగాయల చిరు వ్యాపారులు ఆయా షెడ్లలో కూరగాయలను విక్రయించుకునేందుకు ఆసక్తి చూపకపోవడంతో పోటీపడి ఒకరి తర్వాత ఒకరు రోడ్లపైకి వస్తున్నారు. దీంతో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే జనం బేజారు అవుతున్నారు. అలాగే, కూరగాయల మార్కెట్‌కు వచ్చే వ్యాపారులతో పాటు ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.లక్షలు వెచ్చించి వాటర్‌ప్లాంట్ ఏర్పాటుచేశారు. కానీ, నిర్వహణ సరిగా లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. అసలే వేసవికాలం, ఎక్కడెక్కడి నుంచే రైతులు కూరగాయలు విక్రయించేందుకు, ప్రజలు కొనుగోలు చేస్తుందుకు వస్తుంటారు. మార్కెట్ అధికారులు స్పందించి మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని వ్యాపారులు కోరుతున్నారు.
రోడ్లపైనే మార్కెట్లు..!
Comments
Please login to add a commentAdd a comment