ఏకపక్ష నిర్ణయాలు సరికాదు
నారాయణపేట: నారాయణపేట జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ వైఖరిని నిరసిస్తూ మంగళవారం బార్ అసోసియేషన్ అధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. జిల్లా జడ్జి రఫీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని క్రమశిక్షణ రహితంగా కై ్లంట్ లను, న్యాయవాదులను కించపరుస్తున్నారని అందుకు నిరసనగా బార్ అసోసియేషన్ అధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్నామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్,అసోసియేషన్ సభ్యులు తెలిపారు. జిల్లా జడ్జి వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోర్టు పోలియో జడ్జి మధుసూదన్‌కు,రాష్ట్ర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింహరెడ్డి కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది నాగు రావునామాజీ,బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, ఉపాధ్యక్షుడు నందు నామాజీ, కార్యదర్శి బింరెడ్డి, న్యాయవాదులు రఘువీర్‌యాదవ్, సీతారామారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment