వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలివ్వండి
నారాయణపేట: ప్రాధాన్యత రంగాలైన అగ్రికల్చర్, ఎంఎస్‌ఎంఈలకు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీసీసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బ్యాంకర్లు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సకాలంలో రుణాలు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో కన్వీనర్, లీడ్ బ్యాంకు మేనేజర్ వార్షిక ప్రణాళిక 2024–25 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసానికి రూ.1984.54 కోట్లతో త్రైమాసిక వృద్ధి అని, వార్షిక ప్రణాళికలో 60.62 శాతం అలాగే ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌కు సంబంధించి రూ.123.06 కోట్లతో 48.80 శాతం ప్రగతి అని తెలిపారు. ప్రాధాన్యత రంగానికి 1678.14 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ఆయా బ్యాంకుల ఏజీఎంలు శ్రీహరి, ప్రకాష్, శ్రావ్య, షణ్ముఖచారి, అనిల్‌కుమార్, జిల్లా అధికారులు పలు సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం నాబార్డు వారిచే పొటెన్షియల్ లింక్డ్ ప్లాన్ 2025–26 గాను రూ.3,833.47 కోట్ల రుణ లక్ష్యంతో రూపొందించిన పుస్తకాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ మొత్తం 2024–25 సంవత్సరం కంటే 25.23 శాతం అధికం కాగా, వ్యవసాయ రంగానికి రూ.3470.93 కోట్లు, ఎంఎస్ ఎంఈ రంగానికి రూ.310.30 కోట్ల లకా్‌ష్య్‌న్ని నిర్ధారించారు. సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గ్యంగ్వార్, ట్రైని కలెక్టర్ గరిమా నరుల పాల్గొన్నారు.
వరి పంట పరిశీలన
ధన్వాడ: మండలంలోని మందిపల్లిలో రైతు నర్సింహులు సాగు చేసిన వరి పంటను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. నాలుగు ఎకరాల్లో వరి పంట సాగుచేయగా.. నీరు అందక ఎండిపోయే దశకు చేరుకుంది. గతేడాది పంట సాగుకు ఎలాంటి సమస్య రాలేదని, ఈ ఏడాది భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్డు ఎండిపోయాయని, నీటి సమస్య తీవ్రమైందరి రైతు పేర్కొన్నాడు. స్పందించిన కలెక్టర్ జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఎక్కడెక్కడ ఉందో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని డీఏఓ జాన్ సుధాకర్‌కు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment