మద్దూరులో ఇరుకు రోడ్లపై అవస్థలు
మద్దూరులో కూరగాయల విక్రయాలు రోడ్లపైనే నిర్వహిస్తున్నారు. ఇక్కడ రైతుబజార్, షెడ్లు కానీ నిర్మించలేదు. రోడ్లపై విక్రయాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులను రోడ్లపై నుంచి తొలగించడానికి పోలీసులు ప్రయత్నించినా లాభం లేకుండా పోతుంది. ఇరుకుగా ఉండే పాత బస్టాండ్ చౌరస్తాలో రోడ్లపైనే కూరగాయలు ఇతర ఇతర వస్తువుల విక్రయాలు చేస్తున్నారు. ప్రతి గురువారం జరిగే సంత నాడు వాహనదారులు, ప్రజలు చుక్కలు చూడాల్సిందే. మద్దూరు మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత వెంటనే వీధి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు రైతు బజారును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment