ఫిర్యాదులు సత్వరమేపరిష్కరించాలి
నారాయణపేట: వివిధ సమస్యలపై పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం ఎనిమిది ఫిర్యాదులు అందగా.. చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత పోలీస్‌స్టేషన్లకు పంపించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని సూచించారు.
రైతుల సంక్షేమాన్ని
విస్మరిస్తున్న కేంద్రం
నారాయణపేట: కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించడం తగదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్‌లో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ప్రాజెక్టులకు జాతీయ హోదా, హై స్పీడ్ రైల్వేలైన్ తదితర హామీలు ఇచ్చిన కేంద్రం.. ఏ ఒక్క హామీని నెరవేర్చేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని విమర్శించారు. వ్యవసాయ రంగంలో సబ్సిడీల తగ్గింపు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సరిపడా నిధులు కేటాయించపోవడం దారుణమన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక దేశవ్యాప్తంగా లక్షమంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకానికి కనీసంగా రూ. 3వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా 18 శాతం ముడిచమురు రేట్లు తగ్గినా.. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదన్నారు. మిర్చి ధర క్వింటాల్ రూ. 50వేల నుంచి రూ. 15వేలకు పడిపోయిందన్నారు. ధరల స్థిరీకరణకు నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. పప్పులు, నూనెలతో పాటు 14 రకాల సరకులను చౌకధర దుకాణాల ద్వారా పేదలకు అందించాలన్నారు. సదస్సులో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, కార్యదర్శి బాల్‌రాం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్యగౌడ్, ప్రజా సంఘాల నాయకులు గోపాల్, గోవిందురాజ్, దస్తప్ప, శివకుమార్, అశోక్, బొమ్మన్‌పాడ్ బలరాం, మహమ్మద్ అలీ, నరహరి, పవన్, మల్లేష్ ఉన్నారు.
ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: ముందస్తు అడ్మిషన్ల పేరుతో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాయికుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం డీఈఓ కార్యాలయ అధికారి ఉదయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య పూర్తిగా వ్యాపారంగా మారిందాన్నరు. ప్రతి గల్లీలో మోడల్, ఈ టెక్నో, ఫౌండేషన్, ఐఐటీ, మెడిసిన్ లాంటి తోక పేర్లు తగిలించుకొని యథేచ్ఛగా రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. ఒకే పాఠశాల పేరుతో సబ్ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడం.. రేకులషెడ్ల నుంచి మొదలుకొని బహుళ అంతస్తుల భవనాల్లో తరగతి గదులను నిర్వహించడం విద్యా నియమాలకు విరుద్ధమన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తాగునీరు, వాష్ రూమ్స్, ఫ్యాన్లు వంటి కనీస సౌకర్యాలు లేకపోయినా రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారని ఆరోపించారు. నిబంధనలు పాటించని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి అజయ్, ఉపాధ్యక్షుడు గౌస్, సహాయ కార్యదర్శి వెంకటేష్, కోశాధికారి మహేష్, సురేష్, మహిపాల్ పాల్గొన్నారు.
ఫిర్యాదులు సత్వరమేపరిష్కరించాలి
ఫిర్యాదులు సత్వరమేపరిష్కరించాలి
Comments
Please login to add a commentAdd a comment