విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు
నారాయణపేట: వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా విద్యుత్‌శాఖ ఎస్‌ఈ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిలో లోఓల్టేజీ సమస్య లేకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు వినియోగదారులు సమాచారం అందించేలా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎస్‌ఈ సంజీవరెడ్డి, ఆపరేషన్ డీఈ డీఎల్ నర్సింహారావు, డీఈ శ్రీనివాస్, డీఈటీ జితేందర్, ఏడీ శ్రీనివాస్ ఉన్నారు.
పొదుపు పద్ధతులు పాటించాలి..
మహిళా సంఘాల సభ్యులు పొదుపు పద్ధతులు పాటించి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో సీఆర్‌పీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీఆర్‌పీలు కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఐదు సంఘాల బాధ్యత ఉంటుందని.. క్యాలెండర్ ప్రకారం నడుచుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ మొగుల ప్ప, అడిషనల్ డిఆర్డీఓ అంజయ్య ఉన్నారు.
● అన్ని శాఖల అధికారులు ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్‌లో ఉన్న అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 10 అర్జీలు రాగా.. పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బెంషాలం, ఆర్డీఓ రాంచందర్, ఏఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.
పెదిరిపాడ్ కేజీబీవీలోకలెక్టర్ రాత్రి బస
మద్దూరు: మండలంలోని పెదిరిపాడ్ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం రాత్రి కలెక్టర్ బస చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని పూర్ణ లక్ష్యసాధనకు సంబంధించి రూపొందించిన చిత్రాన్ని విద్యార్థినులతో కలిసి కలెక్టర్ తిలకించారు. ఈ చిత్రం ద్వారా విద్యార్థినులు నేర్చుకున్న విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో విద్యార్థినులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు సందేశాత్మక చిత్రాలను ప్రదర్శించాలని డీఈఓ గోవిందరాజులకు సూచించారు. అనంతరం కలెక్టర్, ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల విద్యార్థినులతో కలిసి అక్కడే బస చేశారు. కార్యక్రమంలో ఏఎంఓ విద్యాసాగర్, శ్రీనివాస్, ఎంఈఓ బాలకిష్టప్ప, తహసీల్దార్ మహేష్‌గౌడ్, ఎంపీడీఓ నర్సింహారెడ్డి, ప్రిన్సిపాల్ గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు.
వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగాసరఫరా చేయాలి
కలెక్టర్ సిక్తా పట్నాయక్
Comments
Please login to add a commentAdd a comment