రియల్ వ్యాపారం పడిపోయింది
జిల్లాలో ఏడాది నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. ప్లాట్లు అమ్మేవారు ఉన్నారు కానీ.. కొనే వారు కరువయ్యారు. గతంలో గజం రూ. 15వేలు పలికిన ప్లాట్లు.. ఇప్పుడు రూ. 12వేలకు అడుగుతున్నారు. గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పేరిట వెంచర్లకు రూ.10వేల చొప్పున కట్టించుకుంది. ప్రస్తుత ప్రభుత్వం 25 శాతం రాయితీ అంటుంది. వెంటనే మార్గదర్శకాలు జారీ చేసి రియల్టర్లను ఆదుకోవాలి. – రవికుమార్ గౌడ్,
రియల్ వ్యాపారి, నారాయణపేట
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి..
డీటీసీపీ లేఅవుట్లు సక్రమంగా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. పాత పద్ధతి విధానంలో గ్రామపంచాయతీ ద్వారానే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్నాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
– నీలప్ప ముదిరాజ్, రియల్ వ్యాపారి, మక్తల్
సద్వినియోగం చేసుకోండి..
అనధికార లేఅవుట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు 25శాతం రాయితీతో చెల్లించాలి. జిల్లాలోని రియల్టర్లు, ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– కిరణ్‌కుమార్, డీటీపీఓ, నారాయణపేట
ఫీజుల వివరాలు రాలేదు..
ప్రభుత్వం జీఓ 28ని విడుదల చేసింది. 10శాతం రిజిస్ట్రేషన్ చేసిన వాటికి ఎల్‌ఆర్‌ఎస్ చేసుకునేందుకు వీలు కల్పించింది. అయితే ఎంత ఫీజు వసూలు చేయాలనేది తమకు అధికారికంగా ఆదేశాలు రాలేదు. త్వరలోనే వస్తాయని ఉన్నతాధికారుల ద్వారా మౌఖికంగా తెలిసింది.
– రాంజీ, సబ్ రిజిస్ట్రార్, నారాయణపేట
●
రియల్ వ్యాపారం పడిపోయింది
రియల్ వ్యాపారం పడిపోయింది
రియల్ వ్యాపారం పడిపోయింది
Comments
Please login to add a commentAdd a comment