ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం
నారాయణపేట: ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. శివరాత్రి పండుగ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పనుల గ్రౌండ్ పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హత ఉన్న వారిని జాబితాలో చేర్చాలన్నారు. పరిశీలన పూర్తి అయ్యాక ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారని తప్పులు లేకుండా జాబితా సిద్ధం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల బేస్మెంట్ లెవెల్ మార్చి 10 లోపు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మోటార్లు అందుబాటులో ఉంచుకోవాలని మరమ్మత్తులు ఉంటే చేయించాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో ట్యాంకర్లను మరమ్మతు చేయించుకోవాలన్నారు. ప్రైవేట్ బోర్‌వెల్స్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కొత్త మోటార్లు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. తాగునీరు ఉదయం 6 గంటలకల్లా గ్రామాలకు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో కూలీలకు ఉపాధి కల్పించేలా అవగాహన కల్పించాలన్నారు. పనులు జరిగే చోట తాగునీటి వసతి కల్పించాలని, పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవి దృష్ట్యా ఉదయమే ఉపాధి పనులు ప్రారంభించాలని తెలిపారు. సరైన యాక్షన్ ప్లాన్ తో ఉపాధి హామీ పనులు చేయాలన్నారు. నర్సరీ అవెన్యూ ప్లాంటేషన్ చేసేందుకు ఇప్పటినుండి చర్యలు తీసుకోవాలన్నారు. రోల్డ్ వైపు చెట్లు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వర్, ట్రైనీ కలెక్టర్ గరిమనరుల, జడ్పీ సీఈవో తదితరులు పాల్గొన్నారు.
వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు
కలెక్టర్ సిక్తాపట్నాయక్
Comments
Please login to add a commentAdd a comment