ఒంటరిగా వెళ్లాలంటే భయం
రెవెన్యూ సహాయకులు లేకపోవడంతో మహిళా ఏఈఓలు ఒంటరిగా వెళ్లి పంట వివరాలు నమోదు చేయడం కష్టంగా ఉంది. గ్రామంలో భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి.. ఏయే సర్వేనంబర్లలో ఏ పంటలు సాగు చేశారనే వివరాలు తెలుసుకోవడానికే సమయం సరిపోవట్లే. రోజువారీగా 20 ఎకరాల వివరాలు సైతం నమోదు చేయలేకపోతున్నాం.
– ప్రశాంతి, ఏఈఓ, నిడుగుర్తి
కొత్త ట్యాబ్‌లు ఇవ్వాలి
పంట వివరాల నమోదుకు ఐదేళ్ల కిందట వ్యవసాయశాఖ ఇచ్చిన ట్యాబ్‌లు ప్రస్తుతం పనిచేయడం లేదు. దీంతో వ్యక్తిగత స్మార్ట్ ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్ చేసుకొని వివరాలు నమోదు చేస్తున్నాం. ఫొటో క్యాప్చర్, డాటా ఎంట్రీ సమయంలో ఫోన్లు వేడెక్కుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లలో వ్యక్తిగత సమాచారం సైతం బయటి వ్యక్తులు చేతుల్లోకి వెళ్తుందనే భయం వెంటాడుతోంది. జిల్లా అధికారులు స్పందించి కొత్త ట్యాబ్‌లు, సర్వేకు సహాయకులను ఇవ్వాలి.
– తిరుపతి, ఏఈఓ, గుండుమాల్
సర్వర్.. సిగ్నల్ సమస్య
రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాల ప్రకారం గ్రామాలకు వెళ్లి పంట వివరాల నమోదు చేయడంలో ఇబ్బందులు తప్పట్లేదు. యాప్‌లో పంటలను సాగు చేసే సమయంలో సర్వర్, సిగ్నల్ సమస్యలు వస్తున్నాయి. సర్వే కోసం ప్రత్యేక ట్యాబ్‌లు అందజేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఏఈఓలు వారి సొంత మొబైల్‌ఫోన్‌లో సర్వే చేస్తున్నారు.
– శ్రావణ్‌కుమార్‌గౌడ్, ఏఈఓ, మద్దూర్
వేగవంతం చేస్తాం
సర్వే నంబర్ల వారీగా సాగుచేసిన పంటల వివరాలు, ఫొటోలు, ఇతర వివరాలను యాప్‌లో ఏఈఓలు పొందుపర్చాలి. డిజిటల్ సాగు సర్వే వేగవంతానికి చర్యలు తీసుకుంటాం. అలాగే, పంట నమోదు చేయించుకోకపోతే పంట విక్రయించే సమయంలో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రైతులు ఏఈఓలకు సహకరించి పంట సాగు వివరాలను నమోదు చేయించుకోవాలి.
– జాన్ సుధాకర్, డీఏఓ
●
ఒంటరిగా వెళ్లాలంటే భయం
ఒంటరిగా వెళ్లాలంటే భయం
ఒంటరిగా వెళ్లాలంటే భయం
Comments
Please login to add a commentAdd a comment