ప్రభుత్వ పథకాలు రైతులకు చేరాలి
నారాయణపేట: ప్రభుత్వం అమలు చేసే పథకాలను రైతులకు చేరే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా లోకల్ బాడీ అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరెట్ వీడియో కన్ఫరెన్స్ హాల్‌లో వ్యవసాయ శాఖపై వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎం కిసాన్ కొరకు పోర్టల్‌లో నమోదు చేసుకున్న రైతుల వివరాలను పరిశీలించాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ కేవైసీ చేసుకోని రైతులను ఈ కేవైసీ చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఆధార్ సీడింగ్ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో పంటల నమోదు 28 శాతంగా నమోదు జరిగిందని, పంటల నమోదును ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రైతుబీమా డెత్ రికార్డు 4 రోజుల్లోగా చేయాలని, అదే విధంగా డాక్యుమెంట్స్ 5 రోజుల్లోగా పోర్టల్ నందు అప్‌లోడ్ చేయాలని సూచించారు. రైతుబీమా క్లెయిమ్ లు త్వరగా చేయాలని, నామినీ అకౌంట్లలో డబ్బులు జమ చేయబడుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు భరోసా, అకౌంట్ నంబర్లను రైతు భరోసా పోర్టల్ నందు నమోదు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment