ఆటోలకు త్వరలో నంబర్ కోడ్
నారాయణపేట: జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్క ఆటో డ్రైవరు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఆటో డ్రైవర్లకు మంగళవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్యాసింజర్ల వద్ద ఎక్కువ చార్జ్ తీసుకోవడం జరుగుతుందని నా దృష్టికి వచ్చినందున ప్రతి ఒక్కరూ జిల్లా కేంద్రంలో ఒకే రేటు పై డబ్బులు తీసుకోవాలని సూచించారు. త్వరలో ప్రతి ఒక్క ఆటోకు ఆటో కోడ్ నెంబర్ ఇవ్వనున్నట్లు, అలాగే ఆటోలలో స్కూల్ పిల్లలను, ప్యాసింజర్లను, కూలీలను పరిమితికి మించి ఎక్కించుకోరాదన్నారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ తప్పకుండా యూనిఫామ్ ధరించాలని, సరాఫ్ బజార్‌తో పాటు పట్టణంలోని రద్దీ గల ప్రాంతాలలో ఎక్కుడ రోడ్డుపై ఆటోలు ఆపి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించరాదన్నారు. టౌన్‌లో రాష్ డ్రైవింగ్ చేయరాదని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని వారికి తగిన గౌరవం ఇవ్వాలని సూచించారు. సరాఫ్ బజార్ రూట్‌ను వన్ వే చేయడం జరుగుతుందని, ఎవరైనా వెళ్లాలనుకుంటే ఓల్డ్ బస్టాండ్ నుంచి సరాఫ్ బజార్ రోడ్‌లోకి వెళ్లవచ్చు అని సూచించారు. ఆర్టీఏ మేఘ గాంధీ, సిఐ శివ శంకర్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment