
ధనార్జనే ధ్యేయంగా దందా
గద్వాల క్రైం: సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వారు నకిలీ సర్టిఫికెట్ల దందాకు తెరలేపా రు. అందులోను ప్రధాన సూత్రధారి గతంలో పదే ళ్లు కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో.. లేని కళాశాలను ఉన్నట్లుగా సృష్టించారు. నిరుద్యోగుల అవసరాన్ని అవకాశంగా మార్చుకొని ఒక్కో నకిలీ సర్టిఫికెట్‌ను రూ.లక్షకుపైనే విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మరికొన్ని రాష్ట్రాల వారికి సర్టిఫికెట్లు విక్రయించినట్లు సమాచారం. నకిలీ డిప్లొమా సర్టిఫికెట్‌తో ఏఈఓగా ప్రభుత్వ ఉద్యోగం పొంది.. దాదాపు ఐదేళ్లు వ్యవసాయ శాఖలో పనిచేసిన వ్యక్తి వ్యవహారం ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తాజాగా ఈ నకిలీ సర్టి ఫికెట్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చెరువుపల్లి బాలకృష్ణను మంగళవారం రాత్రి గద్వాల పోలీసులు అరె స్టు చేసినట్లు డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల స మావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.
పట్టుబడ్డారిలా..
ఇదిలాఉండగా, జిల్లాలో నకిలీ సర్టిఫికెట్‌తో ఏఈఓ ఉద్యోగం పొందిన కాట్రావత్ నరేష్‌తోపాటు మరో వ్యక్తిని ఈ నెల 22న అరెస్టు చేశామన్నారు. అనంతరం ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. పట్టుబడిన ఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకు గద్వాల పోలీసు బృందం రెండు రోజుల క్రితం మిర్యాలగూడకు చేరుకున్నారని తెలిపారు. ఈక్రమంలోనే 25వ తేదీన మిర్యాలగూడ పట్టణ శివారులో గుర్తు తెలియని వ్యక్తులకు నకిలీ సర్టిఫికెట్లు అందిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు రెక్కీ నిర్వహించి బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడి నుంచి మూడు నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నుటు్‌ల్ వెల్లడించారు. ఈ కేసులో బాలకృష్ణ ఏ3గా ఉన్నాడని తెలిపారు. ఇతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి వివరాలు వెల్లడించారని, త్వరలో అతడిని అదుపులోకి తీసుకుంటామన్నారు. 12 మందికి నకిలీ సర్టిఫికెట్లు అందించాడని అతను నేరం అంగీకరించాడన్నారు. ఇప్పటివరకు ఆరుగురి నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నామని, త్వరలో మిగతా వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విషయంలో సీరియస్‌గా ఉందని, పట్టుబడిన నిందితుడిని గద్వాల కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసు విచారణలో సీఐ శ్రీను, ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్, సిబ్బంది చంద్రయ్య, ఇస్మాయేల్ కీలకంగా వ్యవహరించారన్నారు.
పదేళ్లుగా గుట్టుగా దందా
ప్రఽదాన సూత్రధారి చెరువుపల్లి బాలకృష్ణ మిర్యాలగూడ పట్టణంలో ఓ జూనియర్ కళాశాలకు ప్రిన్సిపల్‌గా వ్యవహరించారని, కొన్నాళ్లకు కళాశాలను నడిపించే ఆర్థిక స్థోమత లేక మూసి వేశాడన్నారు. అప్పటి నుంచి ఎలాగైన డబ్బులు సంపదించాలనే లక్ష్యంతో పలు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో ముఠాగా ఏర్పడి నకిలీ సర్టిఫికెట్ల దందాకు తెరలేపాడన్నారు. దాదాపు పదేళ్లుగా నకిలీ సర్టిఫికెట్ల మాఫియా దందాను గుట్టుగా సాగిస్తున్నాడని వివరించారు.
నకిలీ సర్టిఫికెట్ల కేసులో విస్తుపోయే నిజాలు
ఒక్కో సర్టిఫికెట్ రూ.లక్షకుపైనే విక్రయం
తాజాగా ప్రధాన సూత్రధారి బాలకృష్ణ అరెస్టు
మిర్యాలగూడలో చిక్కిన నిందితుడు
కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ మొగిలయ్య
Comments
Please login to add a commentAdd a comment