
గతంలో బోధకులు లేక..
గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆధారిత విద్యా విధానం అమల్లోకి వచ్చిన కొంత కాలానికి అటకెక్కింది. 2005లో పాఠశాలలకు కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేసినా ఒప్పంద గడువు తీరడం.. బోధకులు లేకనో కంప్యూటర్ విద్య మరుగునపడింది. గతేడాది మరోసారి ఐసీటీ స్కూల్ ప్రాజెక్టు కింద 47 పాఠశాలలకు సమగ్రశిక్ష నిధులతో ఒక్కో పాఠశాలకు 5 నుంచి 10 వరకు కంప్యూటర్‌లు వచ్చాయి. ప్రత్యేక బోధకులు లేకపోవడం, శిక్షణ ఇవ్వకపోవడంతో కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి. రూ.లక్షలు వెచ్చించిన ప్రభుత్వం బోధకులను నియమించకపోవడంతో సాంకేతిక విద్య అంతా మిథ్యగానే మారింది. ఇన్నాళ్లకు పాఠశాలల్లో కంప్యూటర్ విద్య పునఃప్రారంభం కానుండడంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment